అడిగినోళ్లందరికీ కరోనా టెస్టులు

సింప్టమ్స్ ఉన్నా, లేకున్నా కరోనా టెస్టు

ఐసీఎంఆర్ తాజా గైడ్ లైన్స్ విడుదల

కాంటాక్ట్స్ అందరికీ పరీక్షలు తప్పనిసరి

యాంటీజెన్ టెస్టులకే ఫస్ట్ ప్రయారిటీ

ఫ్రంట్ లైన్ వర్కర్లలో అందరికీ టెస్ట్

కంటైన్ మెంట్ జోన్ లో వంద శాతం మందికీ పరీక్షలు

‘టెస్టింగ్’పై రాష్ట్రాలు విచక్షణతో నిర్ణయం తీసుకోవాలి

4 కేటగిరీలుగా 6వ వెర్షన్ అడ్వైజరీ

న్యూఢిల్లీ: కరోనా టెస్ట్ చేయాలని అడిగిన ప్రతి ఒక్కరికీ టెస్ట్ చేయాల్సిందేనని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. సింప్టమ్స్ లేకున్నా కరోనా టెస్టులను నిరాకరించొద్దని తాజా గైడ్ లైన్స్ జారీ చేసింది. ‘కరోనా టెస్టింగ్ స్ట్రాటజీపై 6వ వెర్షన్ అడ్వైజరీ’ని ఐసీఎంఆర్ విడుదల చేసింది. అందరికీ ‘టెస్టింగ్ ఆన్ డిమాండ్’ను అనుమతించాలని రెకమండ్ చేసింది. అయితే ‘టెస్టింగ్ ఆన్ డిమాండ్’పై రాష్ట్రాలు తమ పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవాలని తెలిపింది.

నాలుగు కేటగిరీల్లో రికమండేషన్లు..

కరోనా టెస్టింగ్ పై ఇప్పటికే ఉన్న రికమండేషన్లను మరింతగా విస్తరించడంతో పాటు వాటిని 4ప్రధాన కేటగిరీలుగా డివైడ్ చేసినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. కంటైన్ మెంట్ జోన్లలో రొటీన్ సర్వైలెన్స్, ఎంట్రీ పాయింట్ల వద్ద స్క్రీనింగ్.. నాన్ కంటైన్ మెంట్ ఏరియాలు, హాస్పిటల్ సెట్టింగ్స్ లో రొటీన్ సర్వైలెన్స్.. టెస్టింగ్ ఆన్ డిమాండ్.. చాయిస్ ఆఫ్ టెస్ట్.. అనే కేటగిరీల వారీగా తాజా అడ్వైజరీలో అనేక రికమండేషన్లు చేసింది.

ఏ టెస్టు చేయాలన్న చాయిస్ బాధితులకే వదిలేయాలని ఐసీఎంఆర్ తెలిపింది . అయితే, మొదటగా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కే ప్రియారిటీ ఇవ్వాలని, ఆ తర్వాత ఆర్టీపీసీఆర్ లేదా ట్రూనాట్, సీబీ నాట్ టెస్టుల్లో ఒకదానిని సెకండ్ ఆప్షన్ గా ఎంచుకోవచ్చని సూచించింది . ఒకవేళ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులో నెగెటివ్ వచ్చిన తర్వా త సింప్టమ్స్ కనిపిస్తే.. మళ్లీ యాంటీజెన్ టెస్టు లేదా ఆర్ టీ పీసీఆర్ టెస్ట్ చేయాలి.

కంటైన్ మెంట్ జోన్లలో సర్వైలెన్స్ ఇలా..
కంటైన్ మెంట్ జోన్లలో రొటీన్ సర్వీ లెన్స్, ఎంట్రీ పాయింట్ల వద్ద స్క్రీనింగ్ కేటగిరీలో 65 ఏళ్లు పైబడిన, కోమార్బిడిటీస్ కండీషన్ లో ఉన్న వాళ్లందరికీ సింప్టమ్స్ లేకున్నా తప్పనిసరిగా టెస్టులు చేయాలని ఐసీఎంఆర్ సూచించింది . తాజా అడ్వైజరీ ప్రకారం.. కంటైన్ మెంట్ జోన్లలో అందరికీ (100% మందికి) ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేయాలి. ముఖ్యంగా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నపట్టణాల్లో దీనిని తప్పకుండా ఫాలో అవ్వాలి.

ఎంట్రీ పాయింట్ల వద్ద..
వివిధ రాష్ట్రాలకు లేదా దేశాలకు వెళ్లి వచ్చిన ప్యాసింజర్లు అందరికీ ఎంట్రీ పాయింట్ల వద్ద కరోనా టెస్టు సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండాలని ఐసీఎంఆర్ చెప్పింది. గత 14 రోజుల్లో విదేశాలకు వెళ్లొచ్చిన వారిలో సింప్టమ్స్ ఉన్నా, లేకున్నా అందరికీ టెస్ట్ చేయాలి. కరోనా కన్ఫామ్ అయిన వ్యక్తితో కాంటాక్ట్ అయిన అందరు అసింప్టమాటిక్ కాంటాక్టులకు టెస్ట్ తప్పనిసరి. వేరే ప్రాంతాల నుంచి తిరిగి వచ్చిన రిటర్నీలు, మైగ్రెంట్లు సింప్టమ్స్ తో అనారోగ్యం బారిన పడితే ఏడు రోజుల్లోపు ఆర్టీపీసీఆర్, ట్రూనాట్ లేదా సీబీ నాట్ టెస్ట్ ను ప్రయారిటీ ప్రకారం చేయాలి.

ఫ్రంట్ లైన్ వర్కర్లలో అందరికీ..
హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లలో అన్ని అసింప్టమాటిక్ కేసులకూ టెస్టులు చేయాలని ఐసీఎంఆర్  చెప్పింది. సింప్టమ్స్ లేకున్నా.. డైరెక్ట్, హై రిస్క్ కాంటాక్టులందరికీ కరోనా పేషెంట్ తో కాంటాక్ట్ అయిన 5వ రోజు, 10వ రోజుకు మధ్య ఒకసారి టెస్టు చేయాలని తెలిపింది. కంటైన్ మెంట్, మిటిగేషన్ యాక్టివిటీలలో పాల్గొని సింప్టమ్స్ వచ్చిన అందరు హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు కూడా
టెస్టులు చేయాలని పేర్కొంది.

నాన్ కంటైన్ మెంట్ జోన్లలో ఇలా..
కరోనా పాజిటివ్ వ్యక్తితో కాంటాక్ట్ అయి సింప్టమ్స్ లేకున్నా, హై రిస్క్ ఉన్న వ్యక్తులకు ర్యాపిడ్  యాంటీజెన్ టెస్టులు చేసేందుకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. కరోనా పాజిటివ్ పేషెంట్ తో కాంటాక్ట్ అయిన కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులు, 65 ఏళ్లు, ఆపై వయసు ఉన్నవారు, కోమార్బిడిటీస్ ఉన్నవారిని హై రిస్క్ కాంటాక్టులుగా గుర్తించాలి.

హాస్పిటల్ సెట్టింగ్స్ లో ఇలా..
దవాఖాన్లలో చేరిన పేషెంట్లలో తీవ్రమైన శ్వాస సంబంధమైన ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్లందరికీ, సింప్టమాటిక్ పేషెంట్లు అందరికీ కరోనా టెస్టు చేయాలి. హాస్పిటల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న అసింప్టమాటిక్ హై రిస్క్ పేషెంట్లకు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నోళ్లకు, కోమార్బిడిటీ పేషెంట్లకు, 65 ఏళ్లు, ఆపై వయసు ఉన్నవారికి కూడా కరోనా టెస్ట్ తప్పనిసరిగా చేయాలి. సర్జికల్, నాన్ సర్జికల్ ఇన్వాసివ్ ప్రొసీజర్స్ ద్వా రా ట్రీట్ మెంట్ తీసుకుంటున్న అందరు అసింప్టమాటిక్ పేషెంట్లకు కూడా టెస్ట్ చేయాలి. వీరు హాస్పిటల్లో ఉన్న రోజుల్లో వారానికి ఒకసారి మాత్రమే టెస్టు చేయాలి.

దవాఖాన్లలో ఆర్ టీ పీసీఆర్ కే ప్రయారిటీ..
హాస్పిటల్ సెట్టింగ్స్ లో మొదటగా ఆర్టీపీసీఆర్ లేదా ట్రూనాట్ లేదా సీబీ నాట్ టెస్టులకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఆ తర్వాతే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టును సెకండ్ చాయిస్ గా చూడాలి. ఆర్టీపీసీఆర్ లేదా ట్రూనాట్ లేదా సీబీ నాట్ లేదా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులలో.. ఏ ఒక్కదానిలో వైరస్ కన్ఫామ్ అయినా, దానిని పాజిటివ్ గా పరిగణించాలి. పేషెంట్ కోలుకుని డిశ్చార్జ్ అయ్యే ముందు మళ్లీ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కోవిడ్ ఏరియాలోని దవాఖాన నుంచి నాన్ కోవిడ్ ఏరియాలోని దవాఖానకు ట్రాన్స్ ఫర్ అయినా మళ్లీ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏవైనా సర్జరీలు చేసుకోవాల్సి ఉన్న వారు, అంతకుముందు 14 రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాలి. దీనివల్ల సర్జరీకి ముందు కరోనా బారిన పడే చాన్స్ తగ్గుతుంది.

చిన్నారుల పట్ల కేర్ తీసుకోవాలి..
సింప్టమ్స్ ఉండటంతో పాటు తీవ్రమైన శ్వాస సమస్య, సెప్సిస్‌తో బాధపడుతున్న శిశువులందరికీ టెస్ట్ తప్పనిసరిగా చేయాలి. స్ట్రోక్, ఎన్సె ఫలైటిస్, పల్మనరీ ఎంబాలిజం, మల్టిపుల్ ఆర్గాన్ డిస్ ఫంక్షన్ సిండ్రోమ్, కడుపు సంబంధమైన వ్యాధులు, పిల్లల్లో కవాసకీ డిసీజ్ ఉన్న వారికి ట్రీట్ మెంట్ చేస్తున్న డాక్టర్ల సూచన మేరకు కరోనా టెస్ట్ చేయాలి.

తల్లులు జాగ్రత్తలు పాటించాలె..
కరోనా పాజిటివ్‌గా వచ్చిన తల్లులు తమ బిడ్డల సంరక్షణ చూసేటప్పుడు 14 రోజుల పాటు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. తరచూ చేతులు కడుక్కోవాలి. చిన్నారులకు పాలివ్వడానికి ముందు ఛాతీని క్లీన్ చేసుకుని, శుభ్రత పాటించాలి. ఇవి పాటిస్తే తల్లుల నుంచి బిడ్డకు వైరస్ సోకే ప్రమాదం చాలావరకూ తగ్గుతుంది.

ఎమర్జెన్సీ ప్రొసీజర్లు ఆపొద్దు..
డెలి వరీ కోసం దవాఖానలో చేరిన గర్భిణులు, ప్రసవ సమయం దగ్గరపడిన గర్భిణులు అందరికీ కరోనా టెస్టు చేయాలి. కరోనా టెస్టు చేయలేదన్న కారణంతో డెలి వరీలతో సహా ఇతర ఎలాంటి ఎమర్జెన్సీ ప్రొసీజర్‌లనైనా ఆలస్యం చేయరాదు. టెస్టింగ్ సౌకర్యం లేదంటూ ప్రెగ్నెంట్లను వేరే దవాఖాన్లకు రిఫర్ కూడా చేయరాదు. శాంపిళ్లను కలెక్ట్ చేసుకుని, టెస్టింగ్ సెంటర్లకు పంపేందుకు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి.

For More News..

హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ అజరుద్దీన్​పై మెంబర్స్​ తిరుగుబాటు!

డ్రైవింగ్ స్కూళ్లు స్టార్ట్ చేస్తున్న ఆర్టీసీ.. ఫీజు ఎంతంటే..

Latest Updates