గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కేసులపై ICMR సర్వే

గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కేసులపై ఇండియన్ కౌన్సెల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్(ICMR) సర్వే నిర్వహించనుంది. రేపటి (శనివారం) నుంచి  హైదరాబాద్ లో 5 కంటైన్ మెంట్ జోన్లలో రెండు రోజులపాటు సర్వే నిర్వహించనుంది. ఆదిభట్ల, బాలాపూర్, మియాపూర్, చందానగర్, టప్పాచబుత్రా ప్రాంతాల్లో 10 ప్రత్యేక టీమ్ ల ద్వారా సర్వే చేపట్టనుంది. పెరుగుతున్న కేసులు, నాన్ సింప్టమాటిక్ కేసులపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వనుంది. ఇప్పటికే తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ICMR సర్వే పూర్తి చేసింది. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో అధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. డబుల్ డిజిట్స్ లో కేసులు రికార్డవుతుండడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.

Latest Updates