హోటల్ కార్మికులను గుర్తించండి

రాష్ట్రంలో కుటుంబ పోషణ కోసం వివిధ హోటళ్లలో పని చేస్తున్న వేలాది మంది హోటల్ కార్మికులను అసంఘటిత కార్మికులుగా ప్రభుత్వం గుర్తించి , ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి.వెంకటేశం డిమాండ్ చేశారు. ఆదివారం హిమాయత్ నగర్ సత్యనారాయణ రెడ్డి భవన్ లో హోటల్ కంగార్ యూనియన్ రాష్ట్ర సమితి సమావేశం యూనియన్ కార్యనిర్వాహక అధ్యక్షులు ఏ.సోమయ్య అధ్యక్ష తన జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి . వెంకటేశం మాట్లా డుతూ… నిరుద్యోగ సమస్య కారణంగా చాలా మంది విద్యావంతులు వేరే మార్గం లేక హోటల్ కార్మికులుగా పని చేస్తున్నారని ఆయన తెలిపారు. హోటల్ యజమానులు మాత్రం సమాన పనికి సమాన వేతనం చెల్లించకుండా 12 గంటలు పని చేయించుకొని శ్రమ దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హోటల్ కార్మికులను అసంఘటిత కార్మికులుగా గుర్తించి… వారి సమస్యలను అధ్యయనం చేసి అన్ని రకాల సౌకర్యా లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఏ.మహేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి సంతోష్, ఉపాధ్యక్షులు బాబూరావు, మోహన్ రెడ్డి, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

 

Latest Updates