ఇడ్లీ ఇక్కడిది కాదట!

బ్రేక్ ఫాస్ట్​ అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఇడ్లీ.అయితే, దోశె, ఉప్మా, పూరీ ఇలా ఎన్ని ఉన్నా .. ఇడ్లీ వెరీ వెరీ స్పెషల్ . పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా సరే దీన్ని కడుపు నిండా లాగించేస్తారు. అంతేకాదు ఇడ్లీ సులభంగా జీర్ణం అవుతుంది కూడా. మన దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఈజీగా దొరికే ఇడ్లీ.. ఇక్కడ పుట్టలేదని చరిత్రకారులు చెబుతున్న మాట. ఇడ్లీ అంటే సాధారణంగా దక్షిణాది వంటకమని అంతా భావిస్తారు.కానీ, ఫుడ్ హిస్టరియన్ కేటీ ఆచార్య మాత్రం ఇడ్లీ ఇండోనేషియాలో పుట్టిం ది అంటున్నా డు. ఒకప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించిన హిందూ రాజుల దగ్గర పనిచేసే వంట మనుషులు ఉడికించే వంటకాలు కనుగొన్నారట. ఇందులో భాగంగానే ఇడ్లీలు తయారు చేయడం మొదలుపెట్టారట. ఆ తర్వాత అంటే  800–1200 సంవత్సరంలో ఇడ్లీ ఇండియాలో అడుగుపెట్టిం ది. మన దేశంలో తొలిసారిగా కర్నాటకలో ఇడ్లీలు తయారు చేశారట.వాటిని అక్కడ ‘ఇడ్డలి గె’ అని పిలి చేవాళ్లట. వీటినే సంస్కృతంలో ‘ఇడ్డరికా’ అనేవాళ్లట.అరబ్బుల ‘రైస్ బాల్స్’అయితే, కైరోలోని ‘అల్-అజహర్’యూనివర్శిటీ లైబ్రరీలో ఉన్న ఆధారాల ప్రకారం.. ‘దక్షిణ భూభాగంలోనివసించిన అరబ్ వ్యాపారులు ఇడ్లీని ఇండియాకు పరిచయం చేశారు. దక్షిణ భారత దేశ ప్రజలను అరబ్బులు పెళ్లి చేసుకోవడంతో పాటు ఈ ప్రాంతాల్లో స్థిరపడం వల్ల ఇడ్లీ దక్షిణాది వంటకంగా పేరొందింది. అంతేకాదు ముస్లింలు చేసుకునే ‘హలీమ్‌’ కొంచెం స్పెషల్ గా కనిపించేందుకు రైస్ బాల్స్(ఉడికించిన బియ్యపు ఉండలు) తయారు చేసేవారు. ఆ తర్వాత వాటిని గుండ్రంగా, సన్నగా ఇడ్లీల్లా చేశారు. దీంతో పాటు ఇడ్లీలను కొబ్బరి చెట్నీతో తినడం అలవాటు చేసుకున్నారు . ఇలా ఇడ్లీలు దేశమంతా వ్యాపించాయ’ని చరిత్రకారులు చెబుతున్నారు. ఏదెలా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఇడ్లీకి మాత్రం ‘ఇండియన్ ఫుడ్‌’గా అంతర్జా తీయ స్థాయిలో గుర్తింపు వచ్చేసింది.

Latest Updates