IED బాంబు పేలి ఐదుగురు జవాన్లు మృతి

naxalమావోయిస్టులు ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారు. పోలీసులను టార్గెట్ గా దాడులకు పాల్పడుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో మావోయిస్టులు పేళుళ్లకు పాల్పడ్డారు. చోల్నార్ గ్రామంలో పోలీసుల వెహికల్స్ వెళ్తున్న సమయంలో రోడ్డుపై పాతిపెట్టిన ఐఈడీని బ్లాస్ట్ చేశారు. ఈ పేలుడు ధాటికి ఛత్తీస్‌గఢ్ ఆర్మ్‌డ్ ఫోర్స్‌కు చెందిన ముగ్గురు జవాన్లు, డిస్ట్రిక్ట్ ఫోర్స్‌కు చెందిన ఇద్దరు జవాన్లు చనిపోయారు. మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. బాధిత జవాన్లను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. IED బాంబు పేలడంతో.. భద్రతా బలగాలు అలర్టయ్యారు. ఆ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates