ఎయిర్‌‌‌‌పోర్టులో బ్యాగ్‌‌‌‌: అందులో పేలుడు పౌడర్‌‌‌‌

మంగళూరు (కర్నాటక): మంగళూరు ఎయిర్‌‌‌‌పోర్టులో ఓ అనుమానాస్పద బ్యాగ్‌‌‌‌ నుంచి తక్కువ పేలుడు సామర్థ్యమున్న ఐఈడీని ఎయిర్‌‌‌‌పోర్టు సెక్యూరిటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఉదయం 8.45 గంటలకు డిపార్చర్‌‌‌‌ కౌంటర్‌‌‌‌ దగ్గరలోని టికెట్‌‌‌‌ కౌంటర్‌‌‌‌ వద్ద చెకింగ్‌‌‌‌ అధికారులు ఓ బ్యాగ్‌‌‌‌ను గుర్తించారు. విషయం తెలుసుకున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), బాంబ్‌‌‌‌, డాగ్‌‌‌‌ స్వ్యాడ్స్‌‌‌‌, టీమ్‌‌‌‌లు ఎయిర్‌‌‌‌పోర్టును ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు చేపట్టాయి. అనుమానాస్పద బ్యాగ్‌‌‌‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా అందులో సిల్వర్‌‌‌‌ కలర్‌‌‌‌ ప్యాకెట్‌‌‌‌లో ఐఈడీ పౌడర్‌‌‌‌ ఉందని గుర్తించారు. వెంటనే దాన్ని ఎయిర్‌‌‌‌పోర్టుకు దూరంగా తీసుకెళ్లి నిర్వీర్యం చేశారు. ఎయిర్‌‌‌‌పోర్టు వరకు ఆటోలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఈ బ్యాగ్‌‌‌‌ను తీసుకొచ్చి వదిలివెళ్లినట్టు సీసీ ఫుటేజ్‌‌‌‌ ద్వారా గుర్తించామని ఎయిర్‌‌‌‌పోర్టు సెక్యూరిటీ ఆఫీసర్స్‌‌‌‌ తెలిపారు. రిపబ్లిక్‌‌‌‌ డే సమీపిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్‌‌‌‌పోర్టుల్లో సెక్యూరిటీని పెంచారు.

Latest Updates