అగ్రి చట్టాలు రైతులకు అర్థమైతే దేశం అగ్నిలా రగిలేది

If all farmers understood farm laws, country would be on fire: Rahul Gandhi

న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను రైతులందరూ అర్థం చేసుకొని ఉంటే దేశం మొత్తం అగ్నిలా రగిలిపోయేదని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన రాహుల్.. అగ్రి చట్టాలపై పలు వ్యాఖ్యలు చేశారు. ‘కొత్త వ్యవసాయ చట్టాల్లో ఏం ఉందనేది చాలా మంది రైతులు అర్థం చేసుకోవడం లేదు. ఒకవేళ ఆ చట్టాల గురించి అన్నదాతలకు అవగాహన చేసుకుంటే మాత్రం దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకేవి. దేశం మొత్తం అగ్నిలా రగిలిపోయేది’ అని రాహుల్ గాంధీ చెప్పారు. రిపబ్లికే డే నాడు ఎర్రకోట పై జరిగిన విధ్వంసం గురించి కూడా రాహుల్ స్పందించారు. ఏ సమస్యకైనా హింస పరిష్కారం కాదని, దేశ ప్రయోజనాల కోసం కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని కోరారు.

Latest Updates