ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకుంటే గెలుపు మాదే

GHMC ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము ఎక్కడికి వెళ్లినా అపూర్వ స్పందన వచ్చిందన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో కుటుంబ రాజకీయాలపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు.TRS ను ప్రజలు పట్టించుకోవడంలేదన్న విషయం అర్థమైందన్నారు. తెలంగాణకు కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబం శాశ్వతం కాదని స్పష్టం చేశారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకుంటే విజయం తమదేనని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతలు ఇంటికి వచ్చి చెప్పినా… చెప్పకపోయినా ప్రజలంతా పెద్దమనసుతో పోలింగ్ లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని నిలపాలన్నారు. దీంతో కుటుంబ, అవినీతి రాజకీయాలను ఓడించాలని పిలుపునిచ్చారు.

Latest Updates