3ఏండ్లలో 35 లక్షల ఇండ్లిచ్చాం…6ఏండ్లలో కేసీఆర్ ఎన్నిచ్చారు?

ప్రధాని మోడీ నాయకత్వాన్ని బలపర్చి.. GHMC ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన… కేంద్ర పథకాలు అమలు చేయలేక సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారన్నారు. ఆయుష్మాన్ భారత్, పీఎం ఆవాస్  యోజన ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు. కరోనా టైంలో కేసీఆర్ ఎవరికైనా కన్పించారా అని ప్రశ్నించారు.  కరోనా టైంలో ప్రధాని మోడీ ఏం చేశారో మీరు చూశారన్న యోగి..బీజేపీని గెలిపిస్తే, హైదరాబాద్ ను అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. భాగ్యనగరానికి అయోధ్య రాముడి ఆశీస్సులున్నాయన్నారు. ఉత్తరప్రదేశ్ లో మూడేళ్లలో 35 లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చామన్న యోగి ఆధిత్యనాథ్… ఆరేళ్లలో కేసీఆర్ ఎన్ని ఇళ్లు కట్టించారో చెప్పాలన్నారు.

ఇక్కడ ఓ కుటుంబ హిందూస్థాన్ అనేందుకు నోరు రాని MIMతో కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తోందన్నారు. ఆ దోపిడీని అడ్డుకునేందుకు జరిగే ఉద్యమంలో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చానన్నారు.అలహాబాద్ ను ప్రయాగ్ రాజ్ గా బీజేపీ పాలనలో మార్చామని తెలిపారు.ఇక్కడ కూడా బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ భాగ్యనగరంగా పేరు మారటమే కాకుండా అభివృద్ధికి పుంజుకుంటుందన్నారు. మోడీ నమామి గంగె ప్రాజెక్టు తో గంగా ను శుధ్దీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, గంగా నదిని శుద్ది చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ లో ఉన్న నదిని  టీఆర్ఎస్ ప్రభుత్వం అధ్వాన్నంగా మర్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నది పరీవాహక ప్రాంతంలో MIM వాళ్లు కబ్జా చేశారని.. వారిని అక్కడి నుండి జరిపి నది నీరు శుద్ది చేయడంలో TRS విఫలమైందన్నారు.TRS,MIM కలిసి హైదరాబాద్ నగరాభివృద్ధిని అడ్డుకుంటున్నాయన్నారు యోగి ఆధిత్యనాథ్ .

Latest Updates