జూన్ చివరి దాకా లాక్ డౌన్ !

ముంబై : మహారాష్ట్రలోని ముంబై, పుణెల్లో కరోనా కేసుల ఉధృతి ఇలాగే కొనసాగితే లాక్ డౌన్ ను జూన్ చివరి నాటికి పొడగిస్తారంట. మహారాష్ట్రలోని ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇదే విషయాన్ని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. లేదంటే పరిస్థితి చేజారిపోయే ప్రమాదం ఉందంటూ హెచ్చరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో 25 శాతం మహారాష్ట్రలోని ముంబై, పుణె రీజియన్ లో ఉంటున్నాయి. దీంతో లాక్ డౌన్ లోనూ మరింత కఠినంగా ఆంక్షలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రోజుకు యావరేజ్ గా మహారాష్ట్రలో 200 కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. మహారాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ముంబై, పుణెల్లోనే కేసుల సంఖ్య అధికంగా ఉండటంతో ప్రభుత్వం తల పట్టుకుంటోంది. మే 3 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేసిన ఈ రెండు సిటిల్లో మాత్రం బస్సులు, లోకల్ ట్రైన్స్, షాప్స్ ను మూసే ఉంచేలా చర్యలు తీసుకోవాలని థాక్రే సర్కార్ భావిస్తోంది. మరింత పకడ్బందీగా కరోనా నివారణకు చర్యలు తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్క ముంబై లోనే 983 కంటోన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా కరోనా వ్యాప్తి అరికట్టగలిగారు. ధారవి లాంటి స్లమ్ ఏరియాలోనూ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మొత్తం కరోనాను కంట్రోల్ కి తెచ్చేందుకు అవసరమైతే జూన్ చివరి నాటికి లాక్ డౌన్ కొనసాగించాల్సి వస్తే దాన్ని ఎలా అమలు చేయాలనేది ఆలోచిస్తున్నారు.

Latest Updates