మరణాలు తక్కువుంటే..శ్మశానాలు పెంచుడెందుకు?

కాంగ్రెస్ ట్రెజరర్ గూడూరు నారాయణ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: కరోనా రోగులను గుర్తించడం, ట్రీట్ మెంట్ అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయిందని కాంగ్రెస్ ట్రెజరర్ గూడూరు నారాయణ రెడ్డి అన్నారు. జంట నగరాల్లో కరోనా మృతదేహాల అంత్యక్రియలకు గ్యాస్‌ ఆధారిత శ్మశాన వాటికలపై కసరత్తు చేయడం దారుణమని మండిపడ్డారు. హైదరాబాద్ లో 5 శ్మశాన వాటికల్లో 12 చొప్పున రోజుకు 60 శవాలను క్రిమేషన్ ‌‌చేయటానికి రెండు వారాల్లో ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న హెల్త్ ‌‌బులెటిన్లలో కరోనా మృతుల సంఖ్య ఎప్పుడూ 15 కూడా దాటలేదన్నారు. మృతుల లెక్కలు నిజమైనవైతే.. శ్మశాన వాటికల పెంపు ఎందుకన్నారు.

 

Latest Updates