అభివృద్ధి కొనసాగాలంటే టీఆర్ఎస్‌ను గెలిపించాలి

గాంధీనగర్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఈ రోజు గాంధీనగర్ డివిజన్‌‌లో టీఆర్ఎస్ నిర్వహించిన ప్రచారంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి ముఠా పద్మానరేశ్‌‌కు మద్దతుగా చేపట్టిన రోడ్‌‌షోలో కవిత పాల్గొన్నారు. హైదరాబాద్‌‌లో అభివృద్ధి కొనసాగాలంటే టీఆర్ఎస్‌‌ను గెలిపించాలని ప్రజలను ఆమె కోరారు.

‘గడిచిన ఆరున్నరేండ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం నిలబెట్టుకుంది. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే టీఆర్ఎస్‌‌ను గెలిపించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. బీజేపీ నేతలు మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. మతాన్ని, కులాన్ని అడ్డుపెట్టుకొని ఓట్ల కోసం బీజేపీ నాయకులకు వస్తున్నారు. ఈ ఎన్నికలు ఒక కులం కోసమో, మతం కోసమో, ఒక ప్రాంతం కోసమో కాదు. హైదరాబాద్ భవిష్యత్తు కోసం జరుగుతున్నవి. గత సంవత్సరం బండ్ల గణేష్ చేసిన కామెడీలా ఈ సంవత్సరం బండి సంజయ్ చేస్తున్నారు. 2009 సంవత్సరం నవంబర్ 29న తెలంగాణ తెచ్చుడు.. కేసీఆర్ సచ్చుడు అనే నినాదంతో దీక్ష పూని ఇవాళ్టికి 11 ఏండ్లు గడిచాయి’ అని కవిత పేర్కొన్నారు.

Latest Updates