ఫిట్ నెస్ ఉంటే అభినందన్‌ మళ్లీ విమానం ఎక్కొచ్చు

పాకిస్తాన్ కు చెందిన ఎఫ్‌-16 యుద్ధవిమానాన్ని కూల్చి.. ప్రతి దాడి నుంచి తప్పించుకునే క్రమం లో పాక్  ఆర్మీకి చిక్కి.. సురక్షితంగా భారత్‌కు చేరుకున్నారు వింగ్‌ కమాండర్‌ అభినందన్‌. అయితే ఆయన భవితవ్యంపై ఎయిర్ ఫోర్స్ చీఫ్ బీరేందర్ సింగ్ ధనోవా పలు వ్యాఖ్య లు చేశారు. అభినందన్‌ ఫిట్‌గా ఉన్నట్లు మెడికల్‌ పరీక్షల్లో తేలితే మళ్లి పైలట్‌గా సేవలందిస్తాడని వివరించారు. అభినందన్‌కు అవసరమై న చికిత్సలన్నీ చేయిస్తున్నామన్నారు. మెడికల్‌గా ఫిట్‌గా మారిన తర్వాత ఆయన తప్పకుండా యుద్ధవిమానం నడుపుతారన్నారు. ప్రస్తుతం ఆయన వెన్ను నొప్పితో బాధపడుతున్నారని తెలిపారు. పారా చూట్‌తో దిగిన సమయంలో గాయమైనట్లు డాక్టర్లు చెబుతున్నారు. అభినందన్‌ కోలుకున్నతర్వాత అవసరమైన చోట ఆయన సేవలు విని యోగించుకుంటామన్నారు ధనోవా.

 

Latest Updates