మార్చి 16లోపు డెబిట్, క్రెడిట్ కార్డులు వాడకపోతే కొన్ని సేవలు పని చేయవు

న్యూఢిల్లీ: డెబిట్‌/క్రెడిట్‌ కార్డు లావాదేవీల భద్రత పెంపులో భాగంగా ఇటీవల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఓ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వాడకంలోలేని డెబిట్/ క్రెడిట్ కార్డులను బ్లాక్ చేయనున్నట్లు తెలిపింది RBI. ఆన్‌ లైన్‌ లావాదేవీల కోసం మీ దగ్గరున్న డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డులను ఇప్పటి దాకా వాడకపోయినట్లైతే.. ఈనెల 16 నుంచి అవి పనిచేయవు.

మార్చి 16లోగా వినియోగించని కార్డులను నిరుపయోగం  చేయాలని బ్యాంకర్లను..కార్డు మంజూరుదారులను  ఆదేశించింది RBI. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌(RFID) టెక్నాలజీ ఆధారంగా డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డుల లావాదేవీలు పెరిగిపోతుండగా..ఈ సేవల్లో ఎలాంటి మోసాలకు తావులేకుండా వినియోగదారుల కోసం RBI అనేక సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఈ నెల 16 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా  వాడని కార్డులు పనిచేయవని  మరోసారి తెలిపింది RBI.

సవరణ:

మార్చి 16లోపు డెబిట్, క్రెడిట్ కార్డులను ఒక్కసారైనా ఇంటర్నేషనల్, ఆన్ లైన్.. కాంటాక్ట్ లెస్ ట్రాన్సెక్షన్స్ కోసం వాడకపోతే ఆ కార్డులపై ఉన్న ఇంటర్నేషనల్, ఆన్ లైన్, కాంటక్ట్ లెస్ సర్వీసులు నిలిపివేయనున్నారు. అంతేకానీ కార్డులు మొత్తం పని చేయకుండాపోవు. ATM, స్వైపింగ్ మిషన్లలో మాత్రమే వాడవచ్చు.

see also: 60 ఏళ్లకు పెళ్లి చేసుకున్న కాంగ్రెస్ నేత

మారుతీరావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాడు

కళ్యాణి ప్రియదర్శినికి శక్తి ఎంటో చూపించాడు

Latest Updates