వాట్సాప్‌‌లో ఈ ఫీచర్‌‌‌‌ పనిచేయాలంటే..

ఈ మధ్య కాలంలో వాట్సాప్‌‌ యూజర్లు ఎక్కువగా వాడుతున్న ఫీచర్‌‌‌‌ ‘డిలీట్‌‌ ఫర్‌‌‌‌ ఎవ్రీవన్‌‌’. గ్రూప్‌‌లో లేదా పర్సనల్‌‌గా ఎవరికైనా పొరపాటున లేదా తప్పుడు సమాచారంతో ఉన్న మెసేజ్‌‌ సెండ్‌‌ చేసినప్పుడు వెంటనే ఈ ఫీచర్‌‌‌‌ వాడితే, ఆ మెసేజ్‌‌ అందరికీ డిలీట్‌‌ అయిపోతుంది. వెంటనే ‘దిస్‌‌ మెసేజ్‌‌ వాజ్‌‌ డిలీటెడ్‌‌’ అని వస్తుంది. అయితే ఈ ఫీచర్‌‌‌‌ పూర్తిగా పని చేయాలంటే కొన్ని కండీషన్స్‌‌పై ఆధారపడి ఉంటుంది.

  • మెసేజ్‌‌ సెండ్‌‌ చేసిన వాళ్లు, రిసీవ్‌‌ చేసుకున్న వాళ్లు ఇద్దరూ లేటెస్ట్‌‌ వెర్షన్‌‌ ‘వాట్సాప్‌‌’ యాప్‌‌ వాడితేనే ఈ ఫీచర్‌‌‌‌ పని చేస్తుంది. ఇద్దరిలో ఏ ఒక్కరు ఓల్డ్‌‌ వెర్షన్‌‌ వాడుతున్నా ‘డిలీట్‌‌ ఫర్‌‌‌‌ ఎవ్రీవన్‌‌’ పని చేయదు.
  • ఆండ్రాయిడ్‌‌ ఫోన్లలో మాత్రం ఇలా డిలీట్‌‌ చేస్తే, వాట్సాప్‌‌తోపాటు గ్యాలరీలోంచి కూడా ఫైల్స్‌‌ డిలీట్‌‌ అవుతాయి.
  • మెసేజ్‌‌ సెండ్‌‌ చేసిన తర్వాత, డిలీట్‌‌ చేసే లోపు రెసిపెంట్‌‌ మెసేజ్‌‌ చూసే చాన్సుంది. అలా చూసినప్పుడు డిలీట్‌‌ చేసినట్లు వాళ్ల చాట్‌‌లో కనిపిస్తుంది.
  • డిలీట్‌‌ సక్సెస్‌‌ఫుల్‌‌ కాకపోతే, దానికి సంబంధించిన నోటిఫికేషన్‌‌ మాత్రం రాదు. ఒక మెసేజ్‌‌ పంపిన గంటలోపు ఈ ఫీచర్‌‌‌‌ వాడుకోవచ్చు.
  • ఐ ఫోన్లలో ఒక ఫొటో లేదా వీడియోకు సంబంధించిన మెసేజ్‌‌ డిలీట్‌‌ చేసినా, ఆ ఫైల్స్‌‌ ఫోన్‌‌లో సేవ్‌‌ అయి ఉంటాయి. తిరిగి వాటిని మళ్లీ వాడుకునే వీలుంటుంది.

Latest Updates