ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమం ఉధృతం

సమ్మె విరమించి డ్యూటీలో జాయిన్ అవుతామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీనిపై తీవ్రంగా స్పందించారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వథామరెడ్డి. ప్రభుత్వం వైపు నుంచి సమాధానం రాకపోవడంతో  సమ్మె యధాతథంగా కొనసాగుతుందన్నారు.  కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి ఉద్దేశ్యం లేనట్టుగా ఉందన్నారు. సమ్మెపై  హైకోర్టు కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. ఇప్పటి వరకు కార్మికులెవరూ విధుల్లో చేరలేదని…చేరారనే వార్తలు నిజం కాదన్నారు. కార్మికులెవరూ…డ్యూటీలు ఇవ్వాలని డిపోలకు దగ్గరకు వెళ్లోదని కోరారు. కార్మికులను విధుల్లోకి చేర్చుకునే అంశంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోతే మరోసారి సమావేశం అవుతామని,  భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. సమ్మెలో భాగంగా రేపు(శనివారం)  ప్రతి డిపో ముందు ర్యాలీ చేపడతామన్నారు. సేవ్ ఆర్టీసీ పేరుతో నిరసనలు చేపడుతామన్నారు అశ్వథామరెడ్డి.

Latest Updates