MIMకు మేయర్ సీటు అప్పగిస్తే ఏ గుడికీ వెళ్లనీయరు

వరద సాయంపై ఎన్నికల కమిషన్ కు తాను లేక రాయలేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్ఎస్  ప్లాన్ ప్రకారం ఫేక్ లెటర్ క్రియేటర్  చేసిందని… ఆ లెటర్ పై ఉన్నది కూడా తన సంతకం కాదన్నారు. దీనిపై సైబర్ క్రైంకు ఫిర్యాదు చేశామన్నారు. అంతేకాదు ఎన్నికల కమిషన్ కూడా తమకు ఎలాంటి లెటర్ రాలేదని  చెప్పిందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కు బీజేపీ అంటే భయం పట్టుకుందన్నారు. మత విద్వేషాలను రెచ్చ గొట్టేందుకు తాను..భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాని వెళ్లానని అంటున్నారని.. కానీ నిజాలు చెప్పేందుకు ఆలయాని వెళ్లానని తెలిపారు.బీజేపీని బదనాం చేసేందుకు టీఆర్ఎస్ కుట్ర చేస్తోందన్నారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి చరిత్ర తెలియకుండా కొందరు మాట్లాడుతున్నారని…ఆ గుడి పాకిస్తాన్ లో ఉందా.. బాంగ్లాదేశ్ లో ఉందా..లేక ఆఫ్ఘనిస్థాన్ లో ఉందా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాగ్యలక్ష్మి అమ్మవారి కారణంగానే హైదరాబాదుకు భాగ్యనగరం అనే పేరు వచ్చిందని చెప్పారు. టీఆర్ఎస్ ఓటు వేస్తే  MIM కు ఓటు వేసినట్లేనని తెలిపారు. MIM కు మేయర్ సీటు అప్పగిస్తే ఏ గుడికీ వెళ్లకుండా చేస్తారని చెప్పారు.

20 శాతం ఉన్న ముస్లింల గురించి కేసీఆర్ రెచ్చగొట్టినట్టు మాట్లాడొచ్చు కానీ… 80 శాతం మంది హిందువుల గురించి తాను  మాట్లాడితే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించిన బండి సంజయ్..దమ్ముంటే అరెస్టు చేయండి అని అన్నారు. తప్పుడు ప్రచారంతో టీఆర్ఎస్ ఓట్లు పోందాలని చూస్తోందన్న బండి సంజయ్…రేపు చార్జిషీట్ తో పాటు మేనిఫెస్టో రిలీజ్ చేస్తామన్నారు.

Latest Updates