నీట్ ర్యాంక్ లక్ష దాటినా సీటు పక్కా

ఒక్కో సీటుకు ఐదుగురే పోటీ

ఎంబీబీఎస్ సీట్లకు తగ్గిన కాంపిటీషన్

ఆల్ ఇండియా ర్యాంక్ లక్ష దాటినా సీటు పక్కా
రాష్ట్రంలో ప్రస్తుతం 4,965 ఎంబీబీఎస్ సీట్లు
మరో 450 సీట్లు పెరిగే చాన్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈసారి ఎంబీబీఎస్ సీట్లకు కాంపిటీషన్ తగ్గింది. గతేడాది ఒక్కో సీటుకు ఏడుగురు పోటీ పడితే, ఈసారి ఒక్కో సీటుకు ఐదుగురు మాత్రమే పోటీ పడనున్నారు.  నీట్‌‌‌‌‌‌‌‌లో తక్కువ మంది క్వాలిఫై కావడం, సీట్ల సంఖ్య కొద్దిగా పెరగడంతో లక్షల్లో ర్యాంక్ వచ్చిన స్టూడెంట్లకు కూడా సీట్లు దక్కే అవకాశం ఏర్పడింది. తమకు వచ్చిన ర్యాంకుకు సీటు వస్తదో, రాదోనని స్టూడెంట్లు, వారి తల్లిదండ్రుల్లో ఇప్పటికే చర్చ మొదలైంది. తెలంగాణ నుంచి 50,392 మంది నీట్ రాస్తే, 28,093 మందే క్వాలిఫై అయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మొత్తం 4,965 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో 1,615, ప్రైవేట్ లో 3,200 సీట్లు ఉన్నయి. బీబీనగర్ ఎయిమ్స్‌‌‌‌‌‌‌‌లో 50, సనత్ నగర్ ఈఎస్‌‌‌‌‌‌‌‌ఐసీలో మరో 100 సీట్లు ఉన్నయి. ఈ అకడమిక్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎంబీబీఎస్‌‌‌‌‌‌‌‌ క్లాసులు ప్రారంభించేందుకు150 సీట్లతో ఓ ప్రైవేటు కాలేజీకి ఇటీవలే పర్మిషన్ వచ్చింది. మరో 2 ప్రైవేట్ కాలేజీలకు కూడా పర్మిషన్ రావచ్చని మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫీసర్లు తెలిపారు. వీటితో కలిపి మొత్తం సీట్ల సంఖ్య 5,400 వరకూ పెరిగే అవకాశం ఉంది.

కౌన్సిలింగ్ ఇలా..

గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లోని15 శాతం సీట్లను నేషనల్ కోటాలో భర్తీ చేస్తారు. దేశంలోని ఏ  ప్రాంత విద్యార్థులైనా ఈ15 శాతం సీట్లకు పోటీ పడొచ్చు. జాతీయ స్థాయిలో సాధించిన ర్యాంకుల ఆధారంగా ఈ సీట్లను కేటాయిస్తారు. ఎయిమ్స్‌‌‌‌‌‌‌‌ సీట్లను కూడా ఆల్ ఇండియా ర్యాంకుల ప్రకారమే కేటాయిస్తారు. నేషనల్ కోటాలో మన స్టేట్‌‌‌‌‌‌‌‌ నుంచి సుమారు 300 మందికి సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నేషనల్ ర్యాంకులు మాత్రమే విడుదల చేశారు. ఓ పది రోజుల్లో స్టేట్ లెవల్ ర్యాంకులను విడుదల చేయనున్నారు. ఇందులో వచ్చే ర్యాంకుల ఆధారంగా కాళోజీ యూనివర్సిటీ కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది. నేషనల్ కోటాకు ఇచ్చిన15 శాతం సీట్లు పోగా మిగిలిన ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లోని అన్ని సీట్లనూ స్టేట్‌‌‌‌‌‌‌‌ లెవల్ ర్యాంకుల ఆధారంగానే కేటాయిస్తారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్‌‌‌‌‌‌‌‌, ఈడబ్ల్యూఎస్‌‌‌‌‌‌‌‌ రిజర్వేషన్లను పాటించాల్సి ఉంటుంది.

ర్యాంక్ లక్ష దాటినా.. సీటు కన్ఫామ్

ఆల్ ఇండియా ర్యాంక్ లక్ష దాటిన వాళ్లకు కూడా గతేడాది సీట్లు వచ్చాయి. జాతీయ స్థాయిలో 57,588 ర్యాంకు సాధించిన వ్యక్తికి కూడా గతేడాది ఓపెన్ కేటగిరీలో సీటు దొరికింది. ఎస్సీ కేటగిరీలో 1,22,394 ర్యాంకు వరకూ, ఎస్టీ కేటగిరీలో 1,01,361 ర్యాంక్ వరకూ సీట్లు వచ్చాయి. బీసీ ఏ కేటగిరీలో 1,12,262, బీసీ బీ కేటగిరీలో 64,878, బీసీ సీ కేటగిరీలో 1,01,910, బీసీ డీ కేటగిరీలో 65,616, బీసీ ఈ కేటగిరీలో 93,302, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 47,180, మైనారిటీ కేటగిరీలో 95,295 ర్యాంకు వరకూ సీట్లు వచ్చాయి. ఈసారి ఇంకా ఎక్కువ ర్యాంకులు వచ్చినవాళ్లకు కూడా సీట్లు లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

నీట్‌ రిజల్ట్స్‌ లో ప్రింటింగ్ మిస్టేక్
తెలంగాణ నుంచి 49.15% కాదు 55.75% మంది క్వాలిఫై
శుక్రవారం రిలీజ్‌ చేసిన నీట్‌ రిజల్ట్స్‌ లో ప్రింటింగ్‌ మిస్టేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చింది. తెలంగాణ నుంచి 49.15% మంది క్వాలి ఫై అయ్యారని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ శుక్రవారం వెల్లడించింది. అయితే మన రాష్ట్రం నుంచి 55.75% మంది క్వాలిఫై అయ్యారని శనివారం ప్రకటించింది. ఈ మేరకు సవరణ చేస్తూ ఎన్టీఏ ఒక ప్రకటన రిలీజ్‌ చేసింది. మొత్తం 50,393 మంది ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హాజరవ్వగా, 28,093 మంది క్వాలి ఫై అయ్యారని తెలిపింది.

For More News..

మూడు నెలలు 19 అసెంబ్లీ సెగ్మెంట్లకు మంచి నీళ్లు బంద్

నైట్‌‌ రైడర్స్‌ తో సన్‌‌ రైజర్స్‌ ఢీ

Latest Updates