ధరణిలో అవకతవకలు ఉంటే తొలగిస్తాం

హైదరాబాద్ : ధరణి పోర్టల్‌ను అక్టోబర్- 25న సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారని తెలిపారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌. శనివారం ఆయన.. రాష్ట్రంలోని కలెక్టర్లు, అడిషనల్‌కలెక్టర్స్‌, తాహసిల్దార్స్‌, నాయ్‌తాహసిల్దార్స్‌తో శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి సమగ్రంగా ధరణిపోర్టల్‌పై ప్రజెంటేషన్‌ఇచ్చారు. ఈసందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ.. ధరణి పోర్టల్‌ వినూత్నమైందని, ఈ పోర్టల్‌ ద్వారా పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం, సురక్షితమమని అన్నారు. దేశంలోనే ఇలాంటి ప్రయోగం విప్లవాత్మకమైనదని, ఒక ట్రెండ్‌సెట్టర్‌గా నిలుస్తుందని తెలిపారు. సీఎం దృష్టిలో ధరణి పోర్టల్‌ అన్నది పూర్తి పారదర్శకమని, ఎలాంటి అవకతవకలు ఉన్నా వాటిని తొలగిస్తారని తెలిపారు.

రాష్ట్రంలోని 570 మండలాల్లో జాయింట్‌ సబ్‌ రిజిస్ర్టార్స్‌ ఈ విధానం ద్వారా ఒకే గొడుగు కింద పనిచేసే అవకాశం ఉందన్నారు. 142 లోకేషన్స్‌లో సబ్‌రిజిస్ర్టార్స్‌ వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ర్టేషన్‌లు చేస్తారన్నారు. రేపటి నుంచి తాహసిల్దార్స్‌ అంతా కార్యకలాపాలు నిర్వహించ వచ్చన్నారు. ధరణి పోర్టల్‌కు సంబంధించి హార్డ్‌వేర్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. డిస్కం, బ్రాడ్‌ బ్యాండ్‌సర్వీసులన్నీ టీఎస్‌ టీఎస్‌ ద్వారా కల్పిస్తున్నామని అన్నారు.

Latest Updates