జగన్‌‌తో మంచి రిలేషన్ ఉంటే.. సంగమేశ్వరం ఆపించండి

ఏపీ సీఎం జగన్తో మంచి సంబంధాలు ఉన్నాయని కేటీఆర్‌‌‌‌‌‌‌‌ స్వయంగా ఒప్పుకొన్నారని, అలాంటప్పుడు మన దక్షిణ తెలంగాణ ఎడారయ్యేలా ఆ రాష్ట్రం చేపడ్తున్న ప్రాజెక్టులు ఆపేలా కోరాలని మాజీ ఎంపీ, బీజేపీ కోర్‌‌‌‌‌‌‌‌ కమిటీ సభ్యుడు వివేక్‌‌‌‌‌‌‌‌వెంకటస్వామి డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. జగన్‌‌‌‌‌‌‌‌ను సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌‌‌‌‌‌‌‌కు పిలిపించుకుని మాట్లాడాలని చించారు. ఈ మేరకు సోమవారం ఓ వీడియో సందేశం విడుదల చేశారు. గతంలో ఆంధ్రా కాంట్రాక్టర్లు ప్రగతిభ వన్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన విందు సమావేశంలోనే కేసీఆర్‌‌‌‌‌‌‌‌, జగన్‌‌‌‌‌‌‌‌ ఇద్దరూ కమీషన్లు, లావాదేవీల గురించి మాట్లాడుకున్నారని వివేక్ ఆరోపించారు. నీళ్లవిషయంలో జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేకనే అందరం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని గుర్తు చేశారు.

జనాన్ని మాయ చేయడానికే..

ఏపీ ప్రాజెక్టులపై సుప్రీంకోర్టులో కేసు వేశామని కేటీఆర్‌‌‌‌‌‌‌‌ చెప్తున్నారని, గతంలోనే బచావత్‌‌‌‌ అవార్డుపై సుప్రీంలో కేసు వేసినప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలే నీళ్ల పంపకాలు చేసుకోవాలని సూచించిందని వివేక్ చెప్పారు. వివాదం లోకి కర్నాటక, మహారాష్ట్రలను తీసుకురావద్దని కూడా పేర్కొన్నదని గుర్తు చేశారు. కానీ కేసీఆర్ సర్కారు మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టడానికే సుప్రీంలో పిటిషన్ వేసిందని, కర్నాటక, మహారాష్ట్రలను రెస్పాండెం ట్లుగా చేర్చారని విమర్శించారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ చేస్తున్న నీళ్లదోపిడీని ఆపకుండా జనాన్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

‘‘పేదలకు డబుల్‌‌‌‌‌‌‌‌బెడ్రూం ఇండ్లు కట్టించి ఇవ్వలేదు. అన్నిసౌకర్యాలున్న సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌ను కూల్చేసి మరో భారీ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ కట్టేందుకు ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నరు. ఇన్నాళ్లు తనకు తానుగా నంబర్‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌‌‌‌‌ అంటూ చెప్పుకున్నరు. ఈ చర్యలతో కేసీఆర్‌‌‌‌‌‌‌‌ది తుగ్లక్‌‌‌‌‌‌‌‌ పాలన అని ప్రజలే అనుకుంటున్నారు..” అని వివేక్ స్పష్టం చేశారు. సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌పై ఎంత వేగంగా చర్యలు తీసుకుంటున్నారో కరోనా ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ విషయంలోనూ అంతే వేగంగా స్పందించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీహాస్టళ్లలో సౌకర్యాలు కల్పించడానికి ఇంకా ఎక్కువ నిధులు కేటాయించాలని కోరారు. పొరుగు రాష్ట్రంలో కరోనా ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ను ఆరోగ్యశ్రీలో చేర్చారని, కేంద్రం ఆయుష్మాన్‌‌‌‌‌‌‌‌భారత్‌‌‌‌‌‌‌‌లో కరోనాకు ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌ ‌‌‌‌‌‌‌అందిస్తుందని తెలిపారు. ప్రైవేట్‌‌‌‌‌‌‌‌హాస్పిటళ్లుఇష్టం వచ్చినట్టు బిల్లులు వసూలు చేస్తున్నా సర్కారు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని.. లేదా ఆయుష్మాన్‌‌‌‌‌‌‌‌ భారత్‌‌‌‌‌‌‌‌లోనైనా చేరాలని కోరారు.

Latest Updates