లెక్కల్లో చూపని బంగారం ఉంటే ఫైన్ కట్టాల్సిందే!

ఆమ్నెస్టీ స్కీమ్ ను తెస్తోన్న కేంద్రం?

న్యూఢిల్లీ: ప్రజల వద్దనున్న అక్రమ బంగారంపై ప్రభుత్వం కన్నేసింది. పన్ను ఎగవేతలను అరికట్టేందుకు, దిగుమతులను తగ్గించేందుకు ప్రజల వద్దనున్న అక్రమ బంగారం కోసం ఆమ్నెస్టీ ప్రొగ్రాం తేవాలని ఆర్థిక మంత్రిత్వశాఖ చూస్తోంది. లెక్కల్లో చూపింపకుండా ప్రజల వద్ద ఉన్న బంగారం బయటికి తెచ్చే, ఈ ప్రతిపాదన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందుకు కూడా వెళ్లింది. ఈ ప్రోగ్రాం కింద ఎవరి వద్దనైనా అక్రమ బంగారం ఉంటే, దాన్ని పన్ను అధికారులకు తెలిపి లెవీలు, పెనాల్టీలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించి అవకాశం ఉందని ఈ విషయం తెలిసిన వ్యక్తులు తెలిపారు. ఆమ్నెస్టీ ప్రోగ్రాం ప్రతిపాదన ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉందని, సంబంధిత అధికారుల నుంచి అథారిటీలు ఫీడ్ బ్యాక్ కోరుతున్నట్టు పేర్కొన్నారు. బంగారానికి ఫిజికల్ డిమాండ్ ను తగ్గించేందుకు హౌస్ హోల్డ్స్, ఇన్ స్టిట్యూషన్స్ వద్ద ఉన్న 25 వేల టన్నుల ప్రైవేట్ గోల్డ్ ను ట్యాప్ చేసేందుకు ప్రభుత్వం 2015లోనే ప్రయత్నాలు మొదలెట్టింది. ఇన్వెస్ట్ మెంట్ కోసం ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపి, దిగుమతులను తగ్గిస్తోంది. అయితే ఈ ప్రయత్నాలు అంత మంచి ఫలితాలను రాబట్టలేదు. దీంతో ప్రభుత్వం ఇతర ఆల్టర్నేటివ్స్ దృష్టి పెట్టింది. ఈ ప్రోగ్రాం కింద ప్రజలు తమ వద్దనున్న అక్రమ బంగారాన్ని బయటికి వెల్లడిస్తే.. చట్టబద్దమైన బంగారాన్ని కొన్నేళ్ల పాటు ప్రభుత్వం వద్ద ఉంచాల్సి ఉంటుంది. గతేడాది కూడా ఇదే మాదిరి ప్రొగ్రాంను తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. అయితే అప్పట్లో ఈ ప్రోగ్రాం తెచ్చే ప్లాన్స్ ఏమీ లేవని ట్యాక్స్ అధికారులు కొట్టివేశారు. ఈ విషయంపై ఆర్థిక మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి కూడా స్పందించలేదు. ఆమ్నెస్టీ లాంటి ప్రోగ్రామ్స్ వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయని, పన్నులు నిజాయితీగా చెల్లించే వారు కూడా జరిమానాలు విధిస్తారనే భయంతో బంగారం ఎంతుందో చెప్పకపోవచ్చని సుప్రీంకోర్టు అంతకుముందే ఇలాంటి ప్రోగ్రాంలపై వ్యాఖ్యానించింది.

For More News..

కస్టమర్ల డేటా ఎట్లా అమ్ముకుంటరు?

Latest Updates