ఈ జాగ్రత్తలు పాటిస్తే కరోనా దూరం

కరోనా వైరస్ పై కేంద్ర ప్రభుత్వం అలర్టైంది. ఒక వైపు కరోనా వ్యాధి గ్రస్తులకు అవసరమైన చికిత్స అందిస్తూనే… మరో వైపు ఈ వ్యాధి నియంత్రణకు మార్గదర్శకాలను విడుదల చేసింది.. ప్రతి ఒక్కరూ సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

కరోనా బాధితులను కలిస్తే…

…స్వీయ గృహనిర్బంధంలో భాగంగా వ్యక్తులు గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించే సింగిల్ రూమ్ లో ఉండాలి.
ఆ గదికి అటాచ్డ్ టాయిలెట్ ఉంటే మంచిది. ముఖ్యంగా, ఆ ఇంట్లో ఉన్న వృద్ధులకు గర్భవతులకు దూరంగా ఉండాలి. పిల్లలకు దగ్గరగా ఉండకూడదు.
…ఇంట్లో తన కదలికలను  ఆ వ్యక్తి నియంత్రించుకోవాలి. పెళ్లిళ్లకు, ఇతర కార్యక్రమాలకు హాజరుకాకపోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని చాలావరకు అరికట్టవచ్చు.
…ప్రాథమిక శుభ్రత గురించి చెప్పాల్సి వస్తే…. తరచుగా సబ్బుతో, శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలి.
…ఆ వ్యక్తి ఇంట్లోని ఇతర వస్తువులను కడగడం, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం వంటి చర్యలకు దూరంగా ఉండాలి.
…అన్ని సమయాల్లో మాస్కు ధరించాలి. ప్రతి 6 గంటలకు ఓ సారి మాస్కును మార్చుతుండాలి. ఓసారి వాడిన మాస్కును మరోసారి ధరించరాదు.
…కరోనా లక్షణాలు బయటపడ్డాయని భావిస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి సమాచారం అందించడం కానీ, 011-23978046 నంబరుకు ఫోన్ చేయాలి.

తీసుకోవలసిన జాగ్రత్తలు…

-స్వీయ నిర్బంధంలో ఉన్న వ్యక్తిని కేవలం ఒక వ్యక్తి మాత్రమే పర్యవేక్షణ చేయాలి.
-ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వ్యక్తితో షేక్ హ్యాండ్ చేయడం, నేరుగా తాకడం చేయరాదు.
-ఆ వ్యక్తి గదిని శుభ్రపరచాల్సి వచ్చినప్పుడు చేతులకు గ్లోవ్స్ ధరించాలి.
-గ్లోవ్స్ తీసేసిన తర్వాత విధిగా చేతులు శుభ్రపరుచుకోవాలి.
-సందర్శకులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదు.
-ఒకవేళ ఆ వ్యక్తిలో కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలితే.. ఆ వ్యక్తి సన్నిహితులను కూడా 14 రోజుల పాటు స్వీయ నిర్బంధం తప్పనిసరి.
-ఆ వ్యక్తి గదిని 1 శాతం సోడియం హైపో క్లోరైట్ ద్రావణంతో శుభ్రపరచాలి.
-టాయిలెట్లను ఫినాయిల్, బ్లీచింగ్ పౌడర్ తో క్లీన్ చేయాలి.
-ఆ వ్యక్తి బట్టలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉతకాలి.

Latest Updates