బెంగాల్‌లో ఉంటే బెంగాలీ భాషలోనే మాట్లాడాలి : మమత

if-u-are-in-bengal-u-have-to-speak-in-bengal-says-mamatha-benerjee

వెస్ట్ బెంగాల్ లో వచ్చేఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు తృణమూల్ కాంగ్రెస్ సిద్ధమవుతోంది. బీజేపీతో ఎదురవుతున్న ఇబ్బందులను ఎదుర్కొని ముందుకెళ్లాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ వ్యూహాలు రచిస్తోంది. తాజాగా భాషా సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించింది.

బెంగాల్ లో ఏర్పాటుచేసిన ఓ సభలో మమత బెనర్జీ మాట్లాడారు. బెంగాల్ ను మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బెంగాల్ లో ఉన్నవాళ్లంతా బెంగాలీలోనే మాట్లాడాలని మమత కోరారు. తాను బిహార్, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ లాంటి రాష్ట్రాలకు వెళ్లినప్పుడు వారి భాషలోనే మాట్లాడతానని… మన రాష్ట్రానికి వచ్చినవారు కూడా మన భాషలోనే మాట్లాడే రోజులు రావాలని ఆమె అన్నారు.

బైక్ లపై తిరిగే క్రిమినల్స్ ను సహించను 

మరోవైపు… బీజేపీపైనా పరోక్ష విమర్శలు చేశారు. కోల్ కతాలో ప్రస్తుతం డాక్టర్ల ధర్నా తీవ్రంగా జరుగుతోంది. బైక్ ర్యాలీలతో నిరసనలు చేస్తున్నారు. ఈ ధర్నాలు బీజేపీ కుట్ర అని ఆమె ఆరోపిస్తోంది. బెంగాల్ లో ఉండే క్రిమినల్స్ ను.. బెంగాల్ లో బైక్ లపై తిరిగే నేరగాళ్లను తాను సహించే ప్రసక్తే లేదని మమత బెనర్జీ అన్నారు.

మమత వ్యాఖ్యలపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. మమత బెనర్జీ కంట్రోల్ తప్పిమాట్లాడుతున్నారని.. తన గ్రౌండ్ ను మరిచిపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి.

Latest Updates