రేట్లు పెంచితే ఈ నంబర్ కు ఫిర్యాదు చేయండి

నిత్యావసర వస్తువులు, కూరగాయలను అధిక ధరలకు అమ్మేవారిపై కేసులు నమోదు చేస్తామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్​ ఎంవీ.రెడ్డి హెచ్చరించారు. కొత్తగూడెంలోని కలెక్టరేట్​లో పౌరసరఫరాలు, వాణిజ్య పన్నులు, కార్మిక, పోలీస్​శాఖల ఆఫీసర్లతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. అధిక ధరలకు అమ్మకాలు సాగించే వారిపై ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్​లో కంట్రోల్​ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అధిక ధరలపై 08744241950 నెంబర్​కు ఫోన్​ చేసి ఆఫీసర్ల దృష్టికి తీసుకురావాలని సూచించారు. నల్గొండలో నిత్యావసరాలు, ఇతర సామగ్రి ఎవరైనా అధిక ధరలకు అమ్మితే 08682 – 22423 లేదా 9440795618, 7901153248 నంబర్లకు వాట్సాప్​లోనూ ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ రంగనాథ్​తెలిపారు. డయల్ 100 లేదా కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ ద్వారా ప్రజలు అధిక ధరల విక్రయాల సమాచారం ఇవ్వొచ్చన్నారు.

Latest Updates