గోవులను అమ్మితే కఠిన చర్యలు : హరీశ్ రావు

ప్రభుత్వం ఇచ్చే గోవులను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి హరీశ్.  లక్కీ డ్రా ద్వారా  గోవుల్ని పంపిణీ చేస్తామన్నారు. గోవులు పవిత్రమైనవి కాబట్టి వాటిని చిన్న పిల్లలతో సమానంగా చూసుకోవాలన్నారు.  సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులను  అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. రైతులందరూ కూడా సెంద్రీయ వ్యవసాయం చేసే దిశగా అడుగులు వేయాలన్నారు. సేంద్రీయ వ్యవసాయం చేసే రైతుల కోసం ఓ వెబ్సైట్ ను ఏర్పాటు చేస్తామన్నారు హరీశ్.

Latest Updates