సొంత పార్టీ నాయకులైనా సరే..డబ్బులు వసూలు చేస్తే జైల్లో పెడతా : తలసాని

నగరంలో నూతనంగా నిర్మిస్తున్న భవనాల వద్ద డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై టాడా చట్టం నమోదు చేసి జైల్లో పెడతామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.

గోశామహల్ నియోజకవర్గంలో కొంత మంది నాయకులు ఈ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని … సొంత పార్టీ నాయకులైన వదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే స్థానిక పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేయాలని భవన నిర్మాణదారులకు సూచించారు.

ఈ మేరకు దేవాదాయ భూముల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై మసబ్ ట్యాంక్ లోని మంత్రి కార్యాలయంలో కార్పొరేటర్లు , దేవాదాయ శాఖ , పోలీస్ శాఖ , జిహెచ్ఎంసి అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు.

దేవాలయాల భూములు అన్యాక్రాంతం కాకుండా , పురాతన దేవాలయాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను మంత్రి చర్చించారు. గోశామహల్ నియోజకవర్గంలో పురాతన దేవాలయాల అభివృద్ధికి రినోవేషన్ కమిటీని వేసి అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు.

Latest Updates