జలుబు తగ్గాలా? ఇవి పాటించండి

నెల రోజుల నుంచి ఇరామం ఇయ్యకుండ వానలు పడుతున్నయ్‌. ‘ఇగ చాలు వానదేవుడా..పోయిరా!’ అని జనాలు మొత్తుకుంటున్నా ఆగుతలేవు. గీ వానలు చెయ్యవట్టి జ్వరాలతో తిప్పలొచ్చి పడ్డయ్‌.  ఇగ, ముక్కులకు? ముక్కులకు సర్థి పట్టి.. గాలి పీల్చలేకుండా తయారైంది. గోలీలు వేసుకుంటే సర్థి పోదాయే. అందుకే,  గీ చిట్కాల్లో ఏదో ఒకటి ట్రై చేస్తే చాలు.. జలుబుని జాడియ్యొచ్చు. అల్లం టీ తాగితే ముక్కు కారటం తగ్గుతది.  నీళ్లు వేడి చేసుకొని.. గోరు వెచ్చని నీళ్లు మూడు రోజులు వరుసగా తాగితే జలుబే కాదు.. గొంతు నొప్పి, దగ్గు కూడా మాయమైతయ్​. ఆ వేడి నీళ్లలో చిటికెడు ఉప్పు వేసుకొని తాగితే ఇంకా మంచిది. పసుపుని వేడి వేడి పాలల్లో వేసుకొని తాగితే దెబ్బకు సర్ది పోతది. ఒక టేబుల్  స్పూన్​ తేనె రోజుకు రెండుసార్లు తాగాలి. వేడి కూరగాయలు లేదా చికెన్ సూప్ తాగినా  సర్ది మాయమైతది. యూకలిప్టస్ నూనెతో ఆవిరి పీల్చినా సర్ది పోతుంది. సున్నం, ఆరెంజ్​, ఆకుకూరలు తినడం వల్ల శ్వాస కోశం క్లియర్‌‌ అయితది. అవిసె గింజల్ని పది నిమిషాల పాటు నీళ్లలో వేసి ఉడకపెట్టి, ఆ నీళ్లలో నిమ్మరసం కలిపి తాగాలి. రోజూ రెండుసార్లు గ్రీన్ టీ తాగడం వల్ల కూడా మంచి ఫలితం కనపడుతది. ఈ చిట్కాలతో పాటు మంచి నిద్ర కూడా చాలా ముఖ్యం.

Latest Updates