జ్వరమొస్తే మంచంపై మోయాల్సిందే

రోడ్డు లేక తాటిపాముల తండా వాసుల తిప్పలు

పెబ్బేరు,వెలుగు: ప్రతి తండాకు బీటీ రోడ్లు వేస్తున్నామని సర్కారు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. కనీసం రోడ్లు లేక తండా వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్​ మండలంలోని  కుంటివాని తండా (తాటిపాముల తండా)కు ఉన్న మట్టి రోడ్డు పూర్తిగా పాడైపోయింది. దీంతో ఎవరికైనా పానం బాగలేకపోతే కిలో మీటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దూరం మంచంపై మోసుకెళ్లాల్సి వస్తోంది. సోమవారం ఓ వృద్ధుడికి సుస్తి చేస్తే మంచంపై పడుకోబెట్టి ఇలా మోసుకెళ్లారు.  విషయం తెలుసుకున్న శ్రీరంగాపూర్​ జడ్పీటీసీ రాజేంద్రప్రసాద్​ యాదవ్‌‌‌‌‌‌‌‌ తండాను సందర్శించారు. రోడ్డుతో పాటు  నీళ్లు, కరెంట్‌‌‌‌‌‌‌‌ కూడా ఉండడం లేదని తండా వాసులు ఆయన దృష్టికి తీసుకురాగా కలెక్టర్​తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ  ఇచ్చారు.

Latest Updates