అదానీకి అప్పిస్తే.. మాబాండ్స్​ వెనక్కి తీసుకుంటాం

స్టేట్ బ్యాంక్ కు ఫ్రెంచ్‌‌ అసెట్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ కంపెనీ వార్నింగ్

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలోని అదానీ కార్మిచెల్‌‌‌‌‌‌‌ కోల్‌‌ మైన్‌‌కు లోన్‌‌ ఇస్తే, ఎస్‌‌బీఐ  గ్రీన్‌‌ బాండ్లలో పెట్టిన ఇన్వెస్ట్‌‌మెంట్లను వెనక్కి తీసుకుంటామని ఫ్రెంచ్‌‌ అసెట్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ కంపెనీ ఆముండీ స్టేట్‌‌ బ్యాంక్‌‌కు వార్నింగ్‌‌ ఇచ్చింది. అదానీ కార్మిచెల్‌‌ మైన్‌‌కు రూ. 5 వేల కోట్ల అప్పులిచ్చేందుకు ఎస్‌‌బీఐ రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ మైన్‌‌పై  లోకల్‌‌ ప్రజలు, ఎకనామిక్‌‌ యాక్టివిస్ట్‌‌లు అభ్యంతరం చెబుతున్నారు.  ఈ మైన్‌‌ వలన 20 కోట్ల టన్నుల కార్బన్‌‌ డైయాక్సెడ్‌‌ విడుదల అవుతుందని అంచనా. ప్లానెట్‌‌ ఎమెర్జింగ్‌‌ గ్రీన్‌‌ వన్‌‌ ఫండ్‌‌ ద్వారా ఎస్‌‌బీఐ బాండ్లలో ఆముండీ ఇన్వెస్ట్ చేసింది.
కాగా, ఇన్వెస్టర్ల ఒత్తిడి వలన ఈ మైన్‌‌కు లోన్లివ్వడానికి ఫైనాన్షియల్‌‌ కంపెనీలేవి ముందుకు రావడం లేదు. ఈ లోన్‌‌కి సంబంధించి బ్యాంక్ మేనేజ్‌‌మెంట్‌‌కు నవంబర్‌‌‌‌ 26 న లెటర్ రాశామని, తమ అభ్యంతరాలను తెలిపామని ఆముండీ డైరక్టర్‌‌‌‌ జీన్‌‌ జాక్వాస్‌‌ బార్‌‌‌‌బెరీస్‌‌ అన్నారు. ‘ఈ ప్రాజెక్ట్‌‌కు ఎస్‌‌బీఐ లోన్‌‌ ఇవ్వ కూడదని అనుకుంటున్నాం. తుది నిర్ణయం బ్యాంక్‌‌దే. కానీ వారు లోన్‌‌ ఇస్తే మాత్రం మా ఇన్వెస్ట్‌‌మెంట్లను వెంటనే విత్‌‌డ్రా చేసుకుంటాం’ అని పేర్కొన్నారు. ఇలాంటి ప్రాజెక్ట్‌‌లకు ఎస్‌‌బీఐ ఫైనాన్స్‌‌ ఇవ్వదని బ్యాంక్ బాండ్లలో ఇన్వెస్ట్‌‌ చేశామని తెలిపారు. ‘బ్యాంక్‌‌తో మాట్లాడాం. ప్రస్తుతం వారి రెస్పాన్స్‌‌ కోసం ఎదురు చూస్తున్నాం’ అని చెప్పారు. ఈ అంశంపై ఎస్‌‌బీఐ స్పందించలేదు. కాగా, గ్లోబల్‌‌గా ఉన్న అతిపెద్ద అసెట్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ కంపెనీలలో ఆముండీ టాప్‌‌ 10 లో ఉంటుంది. ప్రస్తుతం ఈ కంపెనీ 1,650 బిలియన్‌‌ యూరోల విలువైన అసెట్స్‌‌ను మేనేజ్‌‌ చేస్తోంది.

Latest Updates