చిన్ననాటి జ్ఞాపకాల్ని గుర్తు చేస్తున్న చిన్నారి

తరగతి గదిలో చిన్నపిల్లలు నిద్రపోతుంటే ఎంత ముచ్చటేస్తుందో మనకు తెలియంది కాదు. క్లాస్ లో టీచర్ పాఠాలు చెబుతుండగా పిల్లలు వచ్చే నిద్రను ఆపుకునేందుకు పడే పాట్లు నవ్వులు తెప్పిస్తాయి. అలాంటి ఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్రముఖ కమెడియన్ టోనీ బేకర్ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు.ఆన్ లైన్ క్లాసులు జరుగుతుండగా ఓ చిన్నారి సోఫాలో కూర్చొని నిద్రపోవడం, నిద్రపోవడాన్ని గమనించిన టీచర్ సదరు చిన్నారి పిలవడం, దీంతో కంగారుగా నిద్ర మత్తులో ఉండి ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తమ చిన్న తనంలో క్లాస్ లో జరిగినే చిలిపి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.

Latest Updates