బీజేపీకి మద్దతు ఇస్తే భవిష్యత్తులో ఓటమి తప్పదు: దిగ్విజయ్ సింగ్‌

బీజేపీకి మద్దతు ఇవ్వడంతో భవిష్యత్తులో ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తుందని హర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత్‌ చౌతాలాను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్ సింగ్‌ హెచ్చరించారు. కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కేంద్రమంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ గురువారం రాజీనామా చేశారు. పంజాబ్‌లో బీజేపీకి ఎస్‌ఎడి… హర్యానాలో  జననాయక్‌ జనతాపార్టీ నాయకుడు దుష్యంత్‌ చౌతాలా మద్దతు తెలుపుతున్నారు. మోడీ ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లులతో గతంలో ప్రవేశపెట్టిన మండి (మార్కెట్స్‌)లు కూడా అధికారుల చేతుల్లోకి వెళతాయని దిగ్విజయ్ అన్నారు. ఈ బిల్లులతో రైతులు గిట్టుబాటు ధర (ఎంఎస్‌పి) పొందే అవకాశం ఉండదని, వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని హెచ్చరించారు.

Latest Updates