తింటూ టీవీ చూస్తే గుండె జబ్బు

టీవీలో క్రికెట్ వస్తోంది.. మ్యాచ్ మంచి రంజు మీదుంది.. ఆ రంజుకు స్నాక్స్​ తోడైతే ఆ సరదాయే వేరు. చాలా మంది కుర్రకారు, ఇంట్ లో పెద్దోళ్లు చేసేదిదే. కానీ, అది చాలా ప్రమాదమని హెచ్చరిస్ తున్నారు బ్రెజిల్ లోని యూనివర్సి డాడ్ ఫెడర్ డో రియో గ్రాండే డూసల్ యూనివర్సిటీ పరిశోధకులు. టీవీ చూస్తూ తింటే గుండె జబ్బులు, మధుమేహంవస్తాయని హెచ్చరిస్ తున్నారు. బీపీ, షుగర్ పెరుగుతుందని, నడుం చుట్టూ కొవ్వు పేరు కుపోతుందని హెచ్చరిస్ తున్నారు. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్​ స్థాయులు ఎక్కువవుతాయంటున్నారు. దాని వల్ల జీర్ణక్రియపై ప్రభావం పడు తుందని చెప్పారు. బ్రెజిల్ టీన్స్​పై కార్డి యోవాస్క్యులర్ రిస్క్స్ ఇన్​ అడాలసెంట్స్​ అనే స్టడీ చేశారు పరిశోధకులు. 12 నుంచి 17 ఏళ్ల వయసున్న 33,900 మంది ఆహారపుటలవాట్లు, టీవీ చూసే తీరును పరిశీలించారు.

 

Latest Updates