100కి కాల్ చేస్తే 8నిమిషాల్లో మీ ముందుకు: CP అంజనీ కుమార్

దిశ హత్య తర్వాత ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇందులో భాగంగానే పోలీసులు తీసుకొచ్చిన టోల్ ఫ్రీ నెంబర్లను యూజ్ చేయాలంటున్నారు. పెట్రోలింగ్‌ వాహన సిబ్బంది పని తీరుపై హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఆపదలో ఉన్నవారు ఎవరైన 100 నెంబర్ కు కాల్ చేస్తే కేవలం 8 నిమిషాల టైంలో పోలీసులు అక్కడుంటారని తెలిపారు. ప్రజాసేవ, భద్రత కోసమే పోలీసులు ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. నగర పరిధిలోని కోటి మంది ప్రజలకు భద్రత కల్పించడమే తమ లక్ష్యమన్నారు సీపీ అంజనీ కుమార్.

Latest Updates