ఐఎఫ్ఎస్ అవినీతి తిమింగళం: ఫ్లయిట్ ఛార్జీలకు రూ.3 కోట్లు, కొడుకు బ్యాంక్ అకౌంట్‌‌లో రూ.9.4 కోట్లు

భువనేశ్వర్: వైట్ కాలర్ జాబ్స్‌‌లో ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఉద్యోగాలు కొట్టాలని చాలా మంది కలలు కంటారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లకు ప్రజల్లో మంచి పేరు ఉంటుంది. కానీ కొందరు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్‌‌లు ఉద్యోగాలను అవినీతిమయం చేస్తూ రూ.కోట్లు గడిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఓ ఐఎఫ్ఎస్ అధికారి అవినీతి బయటపడింది. మధ్యప్రదేశ్‌‌లోని భువనేశ్వర్‌‌లో అక్రమంగా కోట్లు గడించిన సీనియర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అభయ్ కాంత్ పాఠక్‌‌ను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.

అభయ్ కొడుకు ఆకాశ్ బ్యాంక్ అకౌంట్‌లో రూ.9.4 కోట్ల అక్రమ డబ్బు ఉండటంతో ఏసీబీ అధికారులు షాక్ అయ్యారు. ఆకాశ్ పేరు మీద మెర్సిడెజ్, బీఎండబ్ల్యూ, టాటా హ్యారియర్‌ కార్లతోపాటు మూడు ఖరీదైన బైకులు రిజిస్టర్ అయి ఉండటం గమనార్హం. ముంబైలోని తాజ్ మహల్ ప్యాలస్‌‌లో రూ.90 లక్షల బిల్లులను కట్టడం, రాజస్థాన్‌‌లోని ఉదయ్‌‌పూర్‌లో కూడా ఇలాగే లగ్జరీ లైఫ్ స్టయిల్‌ గడపడం, లక్షలపైగా బిల్లులు కట్టడం, ఏసీపీ ఆపరేషన్‌‌లో బయటపడింది. లాక్‌‌డౌన్‌‌లో చార్టెడ్ ఫ్లయిట్స్‌‌లో తిరగడం, అందుకు రూ. 3 కోట్లు చెల్లించడం ఆఫీసర్లను విస్మయానికి గురి చేస్తోంది. ఆకాశ్‌‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు పూణేలో విచారణ జరుపుతున్నారు. 

Latest Updates