ఉన్నావ్ నిందితులకు బీజేపీతో కనెక్షన్: ప్రియాంక

ఉన్నావ్ రేప్ బాధితురాలి కుటుంబాన్ని ప్రియాంక గాంధీ పరామర్శించారు. వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. యూపీలో క్రిమినల్స్ కు భయమన్నదే లేకుండా పోయిందని విమర్శించారు. బాధితురాలిని ఏడాదిగా వేధిస్తున్నారని, ఈ కేసులో నిందితులకు బీజేపీతో కనెక్షన్ ఉందని తెలిసిందన్నారు. అందుకే వారిపై ఇన్ని రోజులు కఠినంగా వ్యవహరించలేకపోయారన్నారు. క్రిమినల్స్ కు యూపీలో చోటు లేదని సీఎం అన్నారని, అయితే ఇప్పుడు పరిణామాలు చూస్తుంటే… యూపీలో మహిళలకే చోటు లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Latest Updates