జొన్నలపై రీసెర్చ్​ చేసిన సైంటిస్టుకు అవార్డు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఐసీఏఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిల్లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీసెర్చ్  ఇన్​స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జొన్నలపై రీసెర్చ్​ చేస్తున్న సైంటిస్టు ఏవీ ఉమాకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విత్తన శాస్త్రవేత్త అవార్డు లభించింది.  సోమవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన సీడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు అవార్డును అందజేశారు. ఉమాకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 25 ఏళ్లుగా జొన్న పంటపై పరిశోధనలు చేస్తున్నారు. అధిక దిగుబడులు ఇచ్చే మేలు రకపు జొన్న వంగడాలు, హైబ్రిడ్​ రకాలను  అభివృద్ధి చేశారు.  దేశంలోనే మొదటిసారిగా పశువుల్లో పాలు, మాంసం దిగుబడి పెరగడానికి  జైకార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న్యూట్రిగ్రేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పశుగ్రాసపు జొన్న రకాన్ని విడుదల చేశారు.  బయో ఇంధనాలపైనా ఉమాకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిశోధన చేస్తున్నారు.

Latest Updates