జియోలోకి ఇంటెల్‌‌ రూ. 1,894.50 కోట్లు పెట్టుబడి

న్యూఢిల్లీ: సెమికండక్టర్ల తయారీ సంస్థ ఇంటెల్‌‌ గ్రూప్‌‌కు చెందిన ఇంటెల్‌‌ క్యాపిటల్‌‌ ముకేష్‌‌ అంబానీ జియో ప్లాట్‌‌ఫామ్‌‌లో రూ. 1,894.50 కోట్లను ఇన్వెస్ట్‌‌ చేయనుంది. దీంతో  జియో ప్లాట్‌‌ఫామ్స్‌‌లో ఇన్వెస్ట్‌‌ చేసిన 11 వ ఫారిన్‌‌ ఇన్వెస్ట్‌‌ర్‌‌‌‌గా ఈ కంపెనీ మారనుంది. తాజా డీల్‌‌తో ఇంటెల్‌‌ క్యాపిటల్‌‌కు జియోలో 0.39 శాతం వాటా దక్కుతుంది. మొత్తంగా 11 ఫారిన్​ ఇన్వెస్ట్​మెంట్​​ సంస్థలు , 12 డీల్స్​తో జియోలో 25.09 శాతం వాటాను కొనుగోలు చేశాయి. మిగిలిన డీల్స్‌‌ మాదిరిగానే ఈ డీల్‌‌ కూడా జియో ప్లాట్‌‌ఫామ్స్‌‌ ఈక్విటీ వాల్యూయేషన్‌‌  రూ. 4.91 లక్షల కోట్ల  వద్ద,  ఎంటర్‌‌‌‌ప్రైజ్‌‌ విలువ రూ. 5.16 లక్షల కోట్ల వద్ద కుదిరింది.  రిలయన్స్‌‌ జియో షేరు శుక్రవారం 1.57 శాతం పెరిగి రూ.1,788 వద్ద ముగిసింది. రిలయన్స్ జియోలో ఫేస్‌‌బుక్‌‌ రూ. 43,573.62 కోట్లను ఇన్వెస్ట్‌‌ చేసి 9.99 శాతం వాటాను కొనుగోలు చేసింది. తర్వాత టీపీజీ, కేకేఆర్‌‌‌‌, ఎల్‌‌కాటర్టన్‌‌, జనరల్‌‌ అట్లాంటిక్‌‌, విస్తా ఈక్విటీ పార్టనర్స్‌‌, అబుదాబి ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ అథారిటీ, ముబదాలా, సౌదీ అరేబియా పబ్లిక్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ ఫండ్‌‌లు జియో ప్లాట్‌‌ఫామ్స్‌‌లో ఇన్వెస్ట్‌‌ చేశాయి. రైట్స్‌‌ ఇష్యూ ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌ మరో రూ. 53,124 కోట్లను సమీకరించింది. రైట్స్‌‌ ఇష్యూ, వాటాల విక్రయం ద్వారా గత 11 వారాల్లోనే  రూ. 1.7 లక్షల కోట్లను ముకేష్‌‌ అంబానీ సమీకరించగలిగారు. రిలయన్స్ జియో ఇన్ఫోకమ్‌‌ జియో ప్లాట్‌‌ఫామ్‌‌కు ఫుల్లీ సబ్సిడరీ. ఈ నెట్‌‌వర్క్‌‌కు ఇండియాలో 38.80 కోట్ల మంది సబ్‌‌స్క్రయిబర్లున్నారు. రిలయన్స్ గ్రూప్‌‌ అప్పులు లేని కంపెనీగా మారిందని జూన్ 19 న రిలయన్స్‌‌ ప్రకటించింది.

Latest Updates