అవి దేశానికి వ్యతిరేకం..దూరంగా ఉండండి: స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌కు వార్నింగ్‌‌‌‌‌‌‌‌

ముంబై: ఐఐటీ – బాంబే హాస్టల్‌‌‌‌‌‌‌‌లో ఉండే స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌ ‘‘దేశ వ్యతిరేక, సంఘ వ్యతిరేక కార్యకలాపాల్లో” పాల్గొనవద్దని హాస్టల్‌‌‌‌‌‌‌‌ డీన్‌‌‌‌‌‌‌‌ వార్నింగ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. ఈ మేరకు హాస్టల్‌‌‌‌‌‌‌‌లోని స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌కు ఈ మెయిల్‌‌‌‌‌‌‌‌ ద్వారా సర్క్యూలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాస్‌‌‌‌‌‌‌‌ చేశారు. మొత్తం 15 రూల్స్‌‌‌‌‌‌‌‌ ఉన్న  కాపీని స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌కు పంపారు. హాస్టల్‌‌‌‌‌‌‌‌ వాతావరణాన్ని  కలుషితం చేసేలా  పాంప్లేట్లు పంచడం, ప్రసంగించడం , మ్యూజిక్‌‌‌‌‌‌‌‌ను ప్లే చేయడం లాంటివి కూడా ఒప్పుకోమని ఆ కాపీలో వివరించారు. డీన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌ అఫైర్స్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ ఆమోదించిన విషయాలను మాత్రమే క్యాంపస్‌‌‌‌‌‌‌‌లో అనుమతిస్తామని సర్క్యూలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు. రూల్స్‌‌‌‌‌‌‌‌ను పాటించని స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌ను సస్పెండ్‌‌‌‌‌‌‌‌ చేస్తామని హెచ్చరించారు. దీనిపై స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌ సీరియస్‌‌‌‌‌‌‌‌ అవుతున్నారు. సీఏఏ ఆందోళనలను ఆపేందుకే ఇలాంటి రూల్స్‌‌‌‌‌‌‌‌ పాస్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సీఏఏ వ్యతిరేక ఆందోళనలు ఆపేది లేదని స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. దాదాపు 1500 మంది స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌ రిపబ్లిక్‌‌‌‌‌‌‌‌డే రోజున ర్యాలీ చేసి, ఢిల్లీ షహీన్‌బాగ్‌‌‌‌‌‌‌‌లోని మహిళలకు అనుకూలంగా పోస్టర్లు పెట్టిన రెండు రోజుల తర్వాత ఈ సర్క్యూలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పాస్‌‌‌‌‌‌‌‌ చేశారు.

 

 

 

Latest Updates