అగ్గువ ధరకే కరోనా టెస్ట్.. 20 నిమిషాల్లో రిజల్ట్

  • కొత్తరకం టెస్టింగ్ కిట్​తయారు చేసిన హైదరాబాద్ ఐఐటీ సైంటిస్టులు

న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) సైంటిస్టులు కొత్తరకం కరోనా టెస్టింగ్ కిట్​ను డెవలప్ చేశారు. ఈ కిట్ ద్వారా కేవలం 20 నిమిషాల లోపే రిజల్ట్ పొందవచ్చని సైంటిస్టులు పేర్కొన్నారు. ప్రస్తుతం టెస్టులకు ఉపయోగిస్తున్న రివర్స్ ట్రాన్స్ స్క్రిప్షన్ పాలిమరేస్ చైన్ రియాక్షన్ (ఆర్టీపీసీఆర్) పద్ధతిపై ఆధారపడకుండా కొత్త తరహాలో ఈ టెస్టింగ్ కిట్ పనిచేస్తుందని ఐఐటీ-హైదరాబాద్ ప్రొఫెసర్ శివ్ గోవింద్ సింగ్ ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఈ టెస్ట్ కిట్ 550 రూపాయల వ్యయంతో అభివృద్ధి చేశామని, పెద్ద మొత్తంలో తయారు చేస్తే కిట్ ను 350 రూపాయలకే అందించవచ్చన్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోని ఇఎస్ఐసీ మెడికల్ కాలేజీలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నుంచి పర్మిషన్ రావాల్సి ఉందని చెప్పారు. టెస్ట్ కిట్ పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు. ఈ కిట్​అందుబాటులోకి వస్తే అత్యంత తక్కువ ఖర్చుతో..కరోనా టెస్టులను మరింత వేగవంతం చేయవచ్చన్నారు.

Latest Updates