ఐఐటీ స్టూడెంట్లకూ నో ఎగ్జామ్స్

స్టూడెంట్లందరూ పరీక్షల్లేకుండానే పాస్​.. 

ఐఐటీ కాన్పూర్​ నిర్ణయం

కాన్పూర్: పరీక్షల్లేకుండానే స్టూడెంట్లందరినీ పాస్​ చేయాలని ఐఐటీ కాన్పూర్​ నిర్ణయించింది. అందరినీ తర్వాతి ఏడాది చదువుకు ప్రమోట్​ చేసి సెమిస్టర్​ను ముగిస్తామని చెప్పింది. ప్రస్తుతం కరోనా లాక్​డౌన్​తో ఉన్న అనిశ్చితి వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఇనిస్టిట్యూట్​ డైరెక్టర్​ అభయ్​ కరంధికర్​ చెప్పారు. ‘‘సెమిస్టర్​పై స్టూడెంట్లలో ఉన్న గందరగోళాన్ని చెరిపేస్తూ ఈ 2019–20 సెకండ్​ సెమిస్టర్​ను ముగించాలని నిర్ణయించాం. ఈ ఒక్కసారి స్టూడెంట్లందరికీ పరీక్షల నుంచి మినహాయింపునిస్తునర్నాం. మిడ్​సెమిస్టర్​ ఎగ్జామ్​, క్విజ్​, అసైన్​మెంట్లు, ప్రాజెక్టుల ఆధారంగా వాళ్ల కోర్సులకు గ్రేడ్స్​ ఇస్తాం. ప్రస్తుత అసాధారణ పరిస్థతుల నేపథ్యంలో ఎవరినీ ఫెయిల్​ చేయం.  ఏ, బీ, సీ, ఎస్​ గ్రేడ్స్​ ఇస్తాం’’ అని ఆయన ట్వీట్​ చేశారు. ఎస్​ అంటే శాటిస్​ఫ్యాక్టరీ అని చెప్పారు. ఫైనలియర్​ స్టూడెంట్ల కోసం క్రెడిట్​లకు మినహాయింపునిస్తున్నామన్నారు. అనుకున్న టైంకు వాళ్ల గ్రాడ్యుయేషన్​ను నిర్వహిస్తామన్నారు. జూన్​30 నాటికి అందరికీ గ్రేడ్స్​ ఇస్తామని తెలిపారు. పరీక్షల్లేకుండా స్టూడెంట్లందరినీ పాస్​ చేస్తామన్న ఫస్ట్​ ఐఐటీగా కాన్పూర్​ ఐఐటీ నిలిచింది. అయితే, అంతకుముందు ఐఐటీ బాంబే జూన్​1న మొదలు కావాల్సిన సమ్మర్​ టర్మ్​ను రద్దు చేసింది. ఇది రెగ్యులర్​ టర్మ్​ కాదు. ఈ టర్మ్​లో స్టూడెంట్లు తమ బ్యాక్​లాగ్​ కోర్సులు, క్రెడిట్​ కోర్సులను క్లియర్​ చేసుకునే అవకాశం ఉంటుంది.

For More News..

11 మున్సిపాలిటీలపై కేంద్రం ఫోకస్

64 మందితో 24గంటల సర్జరీ

కూలీల తరలింపునకు 13 కోట్లు ఖర్చుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం

Latest Updates