ఖరగ్‌పూర్ ఐఐటీలో తెలుగు విద్యార్ధి ఆత్మహత్య

పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ ఐఐటీలో చదువుతున్న తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రీసెర్చ్ స్కాలర్ కొండలరావు (28) హాస్టల్ గదిలో ఫ్యాన్ కి ఉరివేసుకొని చ‌నిపోయాడు. ఏప్రిల్ 26 న (ఆదివారం) ఈ విషాద ఘ‌ట‌న జ‌రిగింది. సోమ‌వారం నాడు గ‌ది త‌లుపులు ఎంత‌కీ తెర‌వ‌క‌పోవ‌డంతో తోటి విద్యార్థులు అనుమానం వ‌చ్చి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

స‌మాచారం అందిన వెంట‌నే వారు అక్క‌డ‌కు చేరుకొని, గ‌ది త‌లుపులు ప‌గల‌గొట్టి చూడగా కొండ‌ల‌రావు ఉరికి వేలాడుతూ కనిపించాడు.
ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన కొండ‌ల్ రావు కొన్ని రోజులుగా ఐఐటీలో రిసెర్చ్ స్కాలర్‌గా ఉన్నాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 26న ఎవరూ లేని సమయంలో గదిలో ఉరివేసుకున్నాడు. విషయం తెలిసిన అత‌ని తల్లిదండ్రులు విజయనగరం ఎస్పీ అనుమతితో ఖరగ్ పూర్ కు బయలుదేరారు. కాగా ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

Latest Updates