ధోని టాస్ గెలిస్తే బౌలింగా?బ్యాటింగా? IIT ఎగ్జామ్ లో క్వశ్చన్

వైపు ఎలక్షన్‌, మరో వైపు ఐపీఎల్‌.. రెండూ సమాంతరంగా దేశాన్ని ఊపేస్తున్నాయి. వీటిలో దేన్ని ఫాలో కాకున్నా కష్టమేనేమో. ముఖ్యంగా ఐపీఎల్‌ని. పోయిన సోమవారం ఐఐటీ (మద్రాస్) సెమిస్టర్ ఎగ్జామ్స్‌ నిర్వహించింది. ఆ పేపర్‌లో ఐపీఎల్‌కు సంబంధించి ఓ క్వశ్చన్‌ అడిగారు. అందేంటంటే.. ‘ముంబైతో మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్‌ కెఫ్టెన్‌ ధోనీ టాస్ గెలిస్తే ఫీల్డింగ్ తీసుకుంటాడా? బ్యాటింగా?’ అని. దీనికి ఐదు మార్కులు. మెటీరియల్ అండ్ ఎనర్జీ బ్యాలెన్సెస్ పేపర్లో ఫస్ట్‌ క్వశ్చన్‌ ఇదే. ఈ మ్యాచ్‌ జరుగుతున్న చెపాక్‌లో వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఆన్సర్‌ చేయాలని స్టూడెంట్స్‌కు సూచించింది. ఈ ఎగ్జామ్‌ మే 6న జరిగింది. అంటే మ్యాచ్‌కు ఒక్కరోజు ముందన్నమాట.

‘డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌పై మంచు ఎఫెక్ట్‌ ఎక్కువ. బాల్‌ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండదు. ఫాస్ట్‌ బౌలర్లకూ కష్టమే. బాల్‌ జారుతుంది. నైట్‌ ఫీల్డింగ్‌ చేసే టీంకు ఇది ప్రతికూలం. ఆ రోజు గాలిలో తేమ 70% ఉండొచ్చు. టెంపరేచర్‌ 39 డిగ్రీలు ఉండొచ్చు. సెకండ్‌ ఇన్నింగ్స్‌కు అది 27 డిగ్రీలకు పడిపోవచ్చు. ఈ సమాచారం బేస్‌ చేసుకుని ధోనీ టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ తీసుకోవాలా? లేదా ఫీల్డింగా? అంటూ సుదీర్ఘ సమాచారంతో క్వశ్చన్‌ అడిగారు. ఈ క్లిప్‌ను మ్యాచ్‌కు ముందే ఐసీసీ ట్వీట్‌ చేసింది.ఈ పేపర్‌ తయారు చేసిన ప్రొఫెసర్ విఘ్నేష్ మాట్లాడుతూ.. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమయ్యే టైంకు ఉష్ణోగ్రత 27 డిగ్రీలకు పడిపోతుందని, మంచు కురవడం ఖాయమని, ముందు ఫీల్డింగ్ తీసుకోవడమే మేలని అన్నారు.

ఇదిలాఉంటే.. 7న జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిసిన చెన్నై కెఫ్టెన్‌ ధోని బ్యాటింగ్‌ తీసుకున్నారు. కానీ ఆరు వికెట్ల తేడాతో ముంబై గెలిచింది. బహుశా విఘ్నేష్‌ విశ్లేషణ మేరకు ఫీల్డింగ్‌ తీసుకుని ఉంటే చెన్నై గెలిచేదేమో!

Latest Updates