ఐఐటీ ఎంటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిరం

                ఫీస్ 900% పెంపు

                స్టూడెంట్లకు స్టైపెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కాలేజీల ఫీజులు మామూలుగా ఎంత పెంచుతరు? 10 శాతమో, 20 శాతమో.. మరీ ఎక్కువైతే 50 శాతమో.. కానీ ఐఐటీల్లో ఎంటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీజులు మాత్రం ఏకంగా 900 శాతం పెరగబోతున్నయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. బీటెక్ కోర్సులతో సమానంగా ఫీజులు పెంచేయనున్నారు. దీంతో సెమిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.5 వేల నుంచి రూ. 10 వేల వరకున్న ఫీజులు ఇక ఏడాదికి రూ. 2 లక్షల వరకు కానున్నాయి. ఫీజులు పెంచుడే కాదు గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్టిట్యూడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా ఐఐటీల్లో ఎంటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జాయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యే స్టూడెంట్లకు ఇచ్చే రూ.12,400 స్టైపెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయనున్నారు. ఫ్యాకల్టీల పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఐదేళ్ల తర్వాత రివ్యూ చేసి ప్రమోషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలా? లేక పంపించేయాలా కూడా తేల్చేయనున్నారు. హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌డీ మంత్రి రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పొక్రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఐఐటీల కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

డీబీటీ ద్వారా సాయం

ఫీజులు పెంచినా డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెనిఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (డీబీటీ) ద్వారా అర్హులైన స్టూడెంట్లకు సాయం చేయనున్నారు. ఆపేసిన స్టైపెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డబ్బులతో ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఇతర వసతులను మెరుగుపరచనున్నారు. ఇతర ప్రొఫెషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనులకు కూడా వాడనున్నారు. ఐఐటీల్లోని ఎంటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్సుల సంస్కరణలకు వేసిన ముగ్గురు సభ్యుల కమిటీ ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయంతీసుకున్నట్టు కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్లడించింది. ఫీజులు పెంచడం, స్టైపెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆపడం వల్ల డ్రాపౌట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తగ్గించొచ్చని భావిస్తున్నారు. ఎక్కువ ఫీజులున్న ఎంబీ కోర్సుల్లో డ్రాపౌట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తక్కువగా ఉండటమే ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. టెన్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రాకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకారం ఫ్యాకల్టీ జాయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన ఐదున్నరేళ్ల  తర్వాత ఓ కమిటీ తన పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అంచనా వేస్తుంది. కమిటీ నిర్ణయం మేరకు ప్రమోషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వడం గానీ, జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయమని గాని చెబుతారు. కాగా, ఐఐటీ ముంబై, మద్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ఎంటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీజు రూ.5 వేలు. ఐఐటీ ఢిల్లీలో రూ.10 వేలు. ఐఐటీ ఖరగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెమిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీజు రూ.25, 950. ఇందులో రూ.6 వేలు రిఫండబుల్. తర్వాతి సెమిస్టర్లకు రూ.10,550. మొత్తం 23 ఐఐటీల్లో ఎంటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్సులుండగా, ఏడు పాత కాలేజీల్లో 14 వేల మంది వరకు స్టూడెంట్లున్నారు.

Latest Updates