‘జై కరోనా’ అంటూ ఐఐటీ విద్యార్థుల డ్యాన్సులు

ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్ వల్ల ఇప్పటికే 5,617 మంది చనిపోగా.. లక్ష మందికిపైగా అనారోగ్యం పాలయ్యారు. కరోనా నివారణకు ఆయా దేశాలు, అక్కడి ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. భారత్‌లో ఇప్పటికే కరోనా వల్ల ఇద్దరు చనిపోగా.. 90కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందరూ కరోనా వైరస్‌కు బయపడుతుంటే.. ఢిల్లీలోని ఐఐటీ విద్యార్థులు మాత్రం సంతోష పడుతున్నారు. విద్యార్థులు ‘జై కరోనా’ అంటూ అరుస్తూ డ్యాన్స్ చేసే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఘటన ఢిల్లలోని కారాకోరం హాస్టల్‌లో జరిగింది.

కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఐఐటి ఢిల్లీ మార్చి 31 వరకు అన్ని తరగతులు మరియు పరీక్షలను రద్దు చేసింది. దాంతో విద్యార్థులు సంతోషంతో జై కరోనా అంటూ అరుస్తూ డ్యాన్సులు చేశారు. ‘కోవిడ్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని.. మార్చి 31 వరకు క్యాంపస్‌లో అన్ని తరగతులు, పరీక్షలు మరియు బహిరంగ సభలను వెంటనే రద్దు చేయాలని ఐఐటి ఢిల్లీ నిర్ణయించింది’అని ఐఐటి డైరెక్టర్ వి. రామ్‌గోపాల్ రావు గురువారం ట్వీట్ చేశారు.

అంతకుముందు రోజు అంటే బుధవారం ఢిల్లీ ప్రభుత్వం కరోనా వైరస్‌ను అంటువ్యాధిగా ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మార్చి 31 సినిమా హాళ్ళు మరియు విద్యా సంస్థలను మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.

For More News..

హీరో నితిన్ పెళ్లి వాయిదా?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు కరోనా టెస్ట్

బ్యాడ్‌న్యూస్: అప్పుడే పుట్టిన బిడ్డకు కరోనా

ఫోన్ కొనాలంటే వెంటనే కొనేయండి.. ఏప్రిల్ నుంచి ఫోన్ల ధర పెంపు

Latest Updates