పిల్లలు చేసిన బ్లాక్ ‌పాంథ‌ర్ వీడియో

న్యూఢిల్లీ: హాలీవుడ్ స్టార్ హీరో, బ్లాక్ పాంథ‌ర్ ఫేమ్ చాడ్విక్ బోస్ మన్ (43) గత శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. బోస్ మన్ ఆకస్మిక మరణం చాలా మంది ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేసింది. క్యాన్సర్ తో పోరాడుతూ కూడా పలు సినిమాల్లో అద్భుతంగా యాక్ట్ చేసిన బోస్ మన్ కు నివాళులు అర్పిస్తూ ఫ్యాన్స్ చేసిన పోస్టులు, ట్వీట్లతో ఇంటర్నెట్ హోరెత్తింది. బోస్ మన్ కు ట్రిట్యూట్ గా కొందరు పిల్లలు కలసి చేసిన వీడియో ప్రస్తుతం నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఇకొరొడు బోయిస్ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశాడు. బ్లాక్ ప్యాంథర్, సివిల్ వార్, అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ లాంటి సినిమాల్లో చాడ్విక్ కు సంబంధించిన కొన్ని సీన్స్ ను పేరడీ చేస్తూ కొంత మంది పిల్లలు రూపొందించిన ఈ వీడియో నెటిజన్స్ ను అలరిస్తోంది. చాడ్విక్ కు ఇది ఎమోషన్ ట్రిబ్యూట్ అంటూ అతడి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వాకాండా ఫరెవర్, డెడికేటెడ్ టూ చాడ్విక్ అంటూ ఈ వీడియోకు బోయిస్ క్యాప్షన్ జత చేశాడు. వీడియోకు చివర్లో రెస్ట్ ఇన్ పీస్ కు బదులుగా రెస్ట్ ఇన్ పవర్ చాడ్విక్ అని రాసి ఉన్న చార్ట్ ప్రత్యేకంగా చెప్పొచ్చు. ఈ వీడియోకు 9 లక్షల పైచిలుకు వ్యూస్, 42 వేల లైక్స్ రావడం విశేషం.

Latest Updates