మళ్లీ పవన్ కళ్యాణ్ తో జోడీ?

గతంలో దేవదాసు, పోకిరి వంటి సినిమాలతో టాలీవుడ్ ని ఒక ఊపుఊపేసింది ఇలియానా. తెలుగులో మంచి సినిమాలు చేసే సమయంలో బాలీవుడ్ కి జంప్ అయ్యింది. అక్కడ కూడా రెండు మూడు హిట్లు మాత్రమే ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత హిట్ వరించలేదు. తెలుగులో అంతగా అవకాశాలూ రాలేదు. రవితేజతో నటించిన ‘అమర్ అక్బర్  ఆంటోని’ బిగ్ డిజాస్టర్ అవడంతో తెలుగులో ఆఫర్లు పూర్తిగా కరువయ్యాయనే చెప్పొచ్చు . పోయినేడు హిందీలో ‘పాగల్ పంతీ’ చేసింది కానీ ఆశించినంత సక్సెస్ ను ఇవ్వలేదు. ప్రస్తుతం ‘ది బిగ్ బుల్ ’ఒక్కటే ఆమె చేతిలో ఉంది. దాదాపు ఫేడవుట్ అయ్యే స్టేజ్‌‌లో ఉంది. ఇంక సినిమాల్లో కనిపించదేమో అనుకుంటున్నారంతా. అలాంటి సమయంలో సడెన్ గా ఓ సూ పర్బ్ ఆఫర్ ఆమెని వరించిందని టాలీవుడ్లో గుసగుసలు మొదలయ్యాయి .

అదీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన.‘పింక్ ’ సినిమాని ‘వకీల్ సాబ్ ’గా తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తమిళంలో ‘నేర్కొండపార్వై’గా వచ్చిం ది. అజిత్ లీడ్ రోల్ చేశాడు. అదే రోల్ ఇప్పుడు పవర్ స్టార్ చేస్తున్నాడు. ‘పింక్ ‘లో అమితాబ్ పక్కన ఫేమస్ హీరోయిన్ ఎవరూ నటించలేదు కానీ..‘నేర్కొండపార్వై’లో అజిత్ కి జోడీగా విద్యాబాలన్ నటించారు. పవన పక్కన అయితే ముందు శృతీ హాసన్ అనుకున్నారు కానీ ఆమె డేట్స్అడ్జస్ట్ కాలేదో ఏమో.. ఇప్పుడు ఇలియానా అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ నెల 21 నుంచి ఫైనల్ షెడ్యూల్ జరుగుతుందట. హీరోయిన్ ఎవరన్నది ఫైనల్ అయితే షూటింగ్ మొత్తం పూర్తవుతుందట. ఇలియానా పవన్ కు జోడీగా ‘జల్సా’లో చేసింది. ఇంక ఆమెకి ఆఫర్లు రావేమో అనుకుంటున్న సమయంలో మళ్లీ ఆయన పక్కన చాన్స్ రావడం మంచిదే. కానీ కన్ ఫామ్ అయ్యిందో లేదో తెలియాల్సి ఉంది మరి.

Latest Updates