బావిలో దూకాల్సి వచ్చినా.. ఆయన వెంటే నడుస్తా

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షోభానికి తెరతీస్తూ రెండ్రోజుల క్రితం 22 మంది ఎమ్మెల్యేలు తమ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2018లో జరిగిన అంసెబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలకంగా వ్యవహరించిన ఆ పార్టీ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా కూడా నిన్న రాజీనామా చేశారు. వారంతా ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన పార్టీ మారారు. ఇప్పుడు ఆయన బాటలో పయనించేందుకు ఆ 22 మంది ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. నిన్నటి వరకు ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన ఇమ్రాతి దేవి కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆమె బుధవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ జ్యోతిరాదిత్య సింధియా తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు. తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే సింధియా అని, బావిలో దూకాల్సి వచ్చినా సరే తాను ఎప్పటికీ ఆయన వెంటనే నడుస్తానని చెప్పారామె. తామంతా బెంగళూరులో సొంత నిర్ణయంతో ఉంటున్నామని చెప్పారు. సీఎం కమల్‌నాథ్ తాము చెప్పే విషయాలను అసలు వినేవారు కాదని అన్నారు.

Latest Updates