దారుణ హత్య : భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని..

మేడ్చల్ :  వివాహేతర సంబంధం కారణంగా ఓ వ్యక్తి తన ప్రాణాలు కోల్పోయిన ఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో జరిగింది.  గాజులరామరం బాలాజీ లేఔట్ లో అర్ధరాత్రి ఇన్ఫ్రా జెవెల్ గ్రాండ్ అపార్ట్మెంట్ లో సునీల్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తన భార్యతో సునీల్  అక్రమసంబంధం  పెట్టుకున్నాడన్న కారణంగా సూర్యనారాయణ  అనే వ్యక్తి   కాపు కాసి, మరో ఇద్దరి సహాయంతో కర్రలతో దాడి చేసి సునీల్ ను చంపేశాడు.

తాను ఇంట్లో లేని సమయంలో సునీల్ పలుమార్లు  తన భార్య వద్దకు రావడం గమనించిన సూర్యనారాయణ ఈ ఘటన కి పాల్పడ్డాడు. మంగళవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది..పోలీసులు కేసు నమోదు చేసుకొని బాడీని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం క్లూస్ టీమ్, బాలానగర్ ఏసీపీ ఆద్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Latest Updates