చనిపోయినంక ఫేక్ రిజిష్ట్రేషన్స్ చేస్తున్రు

కంప్లయింట్ చేసిన లోక్ సత్తా

కరీంనగర్,వెలుగు: కరీంనగర్ కార్పొరేషన్ లో విలీనమైన తీగలగుట్టపల్లిలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. చనిపోయిన వారి భూములను కూడా వదలడం లేదు. ఇక్కడి సర్వే నంబర్ 225, 226 లలో ఫ్లాట్ నంబర్ 76ను  1980లో శ్రీరామోజు నాగభూషణం నుంచి ఎలబోతారం గ్రామానికి  చెందిన సపారి విజయలక్ష్మి సేల్ డీడీ(2945) ద్వారా కొన్నారు. ఈమె  1990లో చనిపోయింది. తర్వాత  25 ఏళ్లకు అంటే 2015లో ఇదే భూమిని రాంనగర్ కు చెందిన తవలా మనోహార్ రిజిష్ట్రేషన్ చేయించుకున్నాడు. 2 నెలల తరవాత ఠాకుర్ మనోజ్ సింగ్ కు అమ్మేశాడు. మనోజ్ నుంచి మూడేళ్ల తర్వాత  గుర్రాల శ్రీనివాస్ రెడ్డి కొన్నారు. చనిపోయిన విజయలక్ష్మికి వారసులు లేరు. హుజూరాబాద్ లో ఆమె సోదరుడు వెంకపల్లి సత్యనారాయణ వద్ద ఆమెకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్, వీలునామా ఉన్నాయి. దీంతో కొంతమంది  భూబకాసురులు తమ స్టైల్​లో భూమిని కాజేశారు. ఈ విషయం తెలిసిన లోక్​సత్తా బాధ్యుడు నరెడ్ల శ్రీనివాస్ కేసు విచారణను టాస్క్ ఫోర్స్ కు అప్పజెప్పాలని  పోలీస్ కమిషనర్ ను కోరారు.

 

 

Latest Updates