చెన్నై ఎయిర్ పోర్టులో బంగారం అక్రమ రవాణా

చెన్నై ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారాన్ని స్వాదీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఇంటలీజెన్స్ అందించిన సమాచారం ప్రకారం సౌదీఅరేబియా లోని రియాద్ నుంచి చెన్నైకు అక్రమంగా బంగారం తరలిస్తున్నారన్న సమాచారం అందడంతో టైట్ సెక్యురిటీ ఏర్పాటు చేశారు. అయితే ప్రయాణికులందరూ విమానం దిగిన తర్వాత క్లీనింగ్ సిబ్బందికి ఓ సీటు కింద పర్స్ కనిపించడంతో అధికారులకు తెలియచేశారు. దీంతో పరిశీలించిన కస్టమ్స్ అధికారులకు.. పర్స్ లో 22లక్షల 50వేల విలువైన బంగారు నగలు దొరికాయి. అయితే చెకింగ్ కు బయపడి దుండగుడు… విమానంలోనే పర్స్ ను వదిలేసి వుండవచ్చని అనుమానిస్తున్నారు. తదుపరి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.

Latest Updates